rat-hole miners: సిల్కియారా సొరంగంలో చిక్కుకుపోయిన కార్మికులను రక్షించిన ర్యాట్
హోల్ మైనర్స్, ఉతర్తాఖండ్ ప్రభుత్వ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
కార్మికులను రక్షించినందుకు గాను ప్రభుత్వం వారికి అందజేసిన రూ. 50 వేల చెక్కులను
తిరిగి ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. తాము ప్రాణాలకు తెగించి కార్మికులను
రక్షిస్తే ప్రభుత్వం అందించిన సాయం ఏ మాత్రం పొంతన లేకుండా ఉందని ఆవేదన
చెందుతున్నారు.
సహాయ చర్యల్లో తమ పాత్ర వీరోచితమని కొనియాడినప్పటికీ అందజేస్తున్న
సాయం మాత్రం అందుకు తగ్గట్లుగా లేదంటున్నారు.
కుటుంబసభ్యులు
వద్దంటున్నా వినకుండా ప్రాణాలు ఫణంగా పెట్టి ముందస్తు షరతులు లేకుండా కార్మికులను
రక్షిస్తే తమకు అందుతున్న ప్రతిఫలం అంతంత మాత్రమేనన్నారు. కేవలం రూ. 50 వేలు
అందజేసి చేతులు దులుపేసుకోవడం సరికాదంటున్నారు. శాశ్వత ఉద్యోగం, పక్కా గృహం
కేటాయిస్తే తమ త్యాగానికి తగిన ప్రతిఫలం దక్కినట్లు భావిస్తామంటున్నారు.
సిల్క్యారా
సొరంగం కూలిన ఘటనలో 41 మంది కార్మికులు చిక్కుకుపోయారు. వారిని రక్షించేందుకు
కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు తీవ్రంగా శ్రమించాయి. దేశీయ, అంతర్జాతీయ నిపుణులను
సంఘటనా స్థలం వద్ద మోహరించడంతో పాటు అధునాతన సాంకేతికను వినియోగించింది. కానీ
ఆఖరికి నిషేధిత ర్యాట్ మైనింగ్ విధానంతో కార్మికులను సురక్షితంగా బయటకు
తీసుకువచ్చారు.
సహాయ
చర్యల ఆఖరి దశలో ఆగర్ మిషన్ అక్కరకు రాకుండా పోయింది. ఆ సమయంలో 12 మంది ర్యాట్ హోల్
మైనర్లు సహాయ చర్యలను పూర్తి చేశారు.