liquor consumption in Gujarat International Finance
Tec-City :
గుజరాత్
ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ వ్యాపార సంబంధాలు మెరుగుపరుచుకోవడంతో
పాటు వ్యాపార, సాంకేతిక ప్రముఖులకు అనువైన వాతావరణం కల్పించే చర్యలో భాగంగా మద్యపాన
నిషేధాజ్ఞాలను సరిళీకరించింది.
గుజరాత్
అంతర్జాతీయ ఆర్థిక సాంకేతిక (GIFT) నగరంలో
లిక్కర్ విక్రయాలకు అనుమతించారు. 1960 నుంచి గుజరాత్ లో అమలులో ఉన్న మద్య నిషేధం
ఆంక్షలను తొలిసారిగా సడలించి ఈ నిర్ణయం
తీసుకున్నారు.
అంతర్జాతీయ
వ్యాపార సంబంధాల పెంపే లక్ష్యంగా గుజరాత్
ప్రభుత్వం, మధ్య నిషేధం నుంచి GIFT కు
మినహాయింపు ఇచ్చింది.
జాతిపిత
మహాత్మాగాంధీ జన్మస్థలం కావడంతో గుజరాత్ ఏర్పడినప్పటి నుంచి అక్కడ మద్యం తయారీ,
నిల్వ, విక్రయం, వినియోగంపై నిషేధం ఉంది.
GIFT ను అంతర్జాతీయంగా మరింత ప్రభావశీలమైన
ఆర్థిక, సాంకేతిక కేంద్రంగా మార్చే వ్యూహంలో భాగంగానే ఆంక్షలను గుజరాత్ ప్రభుత్వం
సరళీకరించింది.
గిఫ్ట్
సిటీలో మద్య నిషేధం ఆంక్షల్లో మార్పులు చేసినట్లు తెలిపిన నార్కోటిక్స్, ఎక్సైజ్ విభాగం
అధికారులు, ప్రభుత్వ దృష్టికోణంతో పాటు ఆర్థిక కేంద్రం సుస్థిరత కోసం ‘వైన్ అండ్
డైన్’ కు మినహాయింపు ఇస్తున్నట్లు వివరించారు.
జాతీయ,
అంతర్జాతీయ సాంకేతిక నిపుణులు, ప్రపంచ వ్యాపార ప్రముఖులకు అనువైన వ్యాపార వాతావరణం
కల్పించే చర్యల్లో భాగంగా ఆంక్షల్లో మార్పులు చేయాల్సి వచ్చిందని స్పష్టం చేశారు.
తాజా
సవరణ ద్వారా గిఫ్ట్ సిటీలో లిక్కర్ అమ్మకాలు, వినియోగానికి అనుమతి లభించింది.
అతిథులతో పాటు ఉద్యోగులు ఇక నుంచి లిక్కర్ తీసుకునేందుకు వెసులుబాటు లభించింది. సామాన్య
పౌరులకు మాత్రం నిషేధం కొనసాగుతుంది. గిఫ్ట్ సిటీలో ఏర్పాటు చేసే రెస్టారెంట్లు,
క్లబ్లు, బార్లలో మద్యాన్ని ఉద్యోగులు, వ్యాపార ప్రముఖులు కొనుగోలు చేసుకోవచ్చు.
పన్ను మినహాయింపు, స్వీయ నియంత్రణ తోపాటు ఇప్పుడు
మద్యానికి అనుమతి ఇవ్వడం ద్వారా గిఫ్ట్ సిటీ విదేశీ పెట్టుబడుల ఆకర్షణ కేంద్రంగా మారనుంది.