భారత
బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు, అత్యధిక ఆదాయం ఆర్జించిన మహిళా అథ్లెట్స్
ఫోర్బ్స్ జాబితా-2023లో చోటు దక్కించుకున్నారు. జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్ తో కలిసి
ఆమె 16వ స్థానంలో నిలిచారు. రూ. 59 కోట్ల ఆదాయం పొందుతున్నారు.
గత
ఏడాది కూడా ఇదే ఆదాయాన్ని పొందిన పీవీ సింధు, 12వ స్థానంలో నిలవగా, జపాన్ టెన్నిస్
క్రీడాకారిణి నోమి ఒసాకా ఆగ్రస్థానంలో ఉన్నారు.
2018 జాబితాలో రూ. 70 కోట్ల సంపాదనతో
టాప్ టెన్ జాబితాలోకి ఎగబాకిన సింధు ఏడో స్థానాన్ని కైవసం చేసుకున్నారు.
గత
ఏడాది కామన్వెల్త్ క్రీడల తర్వాత గాయాలపాలైన సింధు, ఆటలో ఇంతకు ముందులా
రాణించలేపోతుందనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
ఈ ఏడాది మ్యాడ్రిడ్ స్పెయిన్
మాస్టర్స్ లో రన్నరప్ గా నిలవగా, డెన్మార్క్ ఓపెన్, ఆర్కిటెక్ ఓపెన్ లో సెమీస్
తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆటలో విఫలం అవుతున్నప్పటికీ ఆదాయంలో మాత్రం
ఎలాంటి మార్పులు లేవు. ఫోర్బ్స్ 2023 జాబితాలో భారత్ నుంచి టాప్-20లో నిలిచిన
మహిళా అథ్లెట్ గా పీవీ సింధు రికార్డు సృష్టించారు.