కోవిడ్ కొత్త వేరియంట్ వేగంగా విస్తరిస్తోంది. గడచిన 24 గంటల్లో 752 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రకటించింది. దీంతో కోవిడ్ కేసుల సంఖ్య 3420కు చేరింది. కరోనా కారణంగా ఇప్పటి వరకు 5,33,332 మంది మరణించారు. తాజాగా కేరళలో మరో ఇద్దరు చనిపోయారు. రాజస్థాన్, కర్ణాటకలో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తాజాగా వెల్లడించారు. కొత్తగా నమోదైన కేసులతో సహా, ఇప్పటి వరకు 4,50,07,964 మంది కోవిడ్ భారినపడ్డారు.
భారత్లో కరోనా రికవరీ రేటు 98.81 శాతం నమోదైంది. మొత్తం కరోనా భారిన పడిన వారిలో 4,44,71,212 మంది కోలుకున్నారు. కరోనా సోకిన (covid news) వారిలో 1.19 శాతం మంది మృత్యువాత పడ్డారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. 220 కోట్ల డోసుల వ్యాక్సిన్ అందించినట్లు కేంద్రం ప్రకటించింది.