మానవ అక్రమ రవాణా జరుగుతోందనే సమాచారంతో 300 మంది భారత ప్రయాణీకులతో వెళుతోన్న విమానాన్ని ఫ్రాన్స్ నిపిలివేసింది. శుక్రవారంనాడు ఈ ఘటన జరిగింది.300 మందిని అక్రమంగా తరలిస్తున్నారంటూ ఓ అనామక వ్యక్తి ఇచ్చిన సమాచారంతో ఫ్రాన్స్ ప్రయాణీకుల విమానాన్ని నిలిపివేసినట్లు ప్యారిస్ పబ్లిక్ ప్రాసిక్యూటరు కార్యాలయం శుక్రవారం ప్రకటించింది.
రొమేనియా దేశానికి చెందిన లెజెండ్ విమానం దుబాయ్ నుంచి నికరాగువా వెళుతూ ఇంధనం కోసం ఫ్రాన్స్‌లో దిగింది. ముందే అందిన సమాచారం మేరకు వ్యాట్రీ విమానాశ్రయ అధికారులు విమానం దిగిన వెంటనే అదుపులోకి తీసుకున్నారు. వెంటనే పోలీసులు విచారణ ప్రారంభించారు. అనుమానిత ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఇంకా ప్రయాణీకులు పోలీసుల అదుపులోనే ఉన్నారు. భారత ప్రయాణీకులకు బస ఏర్పాట్లు చేశారు.