బంగారం స్మగ్లింగ్ (gold smuggling) కొత్త పుంతలు తొక్కుతోంది. సూటు కేసులు, బూట్లు, జుట్టులో బంగారం దాచి స్మగ్లింగ్ చేయడం తరచూ వింటూనే ఉంటాం. కానీ ఏకంగా కడుపులోనే బంగారం దాచుకుని ఓ ప్రయాణీకుడు అధికారులకు పట్టుబడిన ఘటన తమిళనాడులోని తిరుచ్చిలో చోటు చేసుకుంది.
కడుపులో బంగారం ఉండలు పెట్టుకుని ఓ ప్రయాణీకుడు తిరుచ్చి విమానాశ్రయంలో పట్టుబడ్డాడు. గురువారం రాత్రి తిరుచ్చి విమానాశ్రయంలో తనిఖీలు చేస్తుండగా, ఓ ప్రయాణీకుడి పొట్టలో స్కానర్ ద్వారా బంగారం గుర్తించారు. కస్టమ్స్ అధికారులు అతన్ని అదుపులోకి తీసుకుని న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు. అనంతరం న్యాయమూర్తి అనుమతితో అతనికి ఆపరేషన్ చేయించారు. అతని కడపు నుంచి 20 బంగారం ఉండలు బయట పడటంతో అధికారులు నివ్వెరపోయారు.బంగారం స్వాధీనం చేసుకుని, ప్రయాణీకుడిపై కేసు నమోదు చేశారు.