ప్రవాసాంధ్ర
భరోసా బీమా ప్రీమియంలో సగ భాగాన్ని చెల్లించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకొచ్చిందని
మిగతా మొత్తాన్నే పాలసీ దారులు చెల్లించాల్సి ఉంటుందని ఏపీఎన్ఆర్టీఎస్(APNRTS) అధ్యక్షుడు వెంకట్ ఎస్. మేడపాటి వెంకట్ అన్నారు.
ఉపాధి
కోసం విదేశాలకు వలస వెళ్ళిన ఆంధ్రుల కోసం ఏపీ ప్రభుత్వం ‘ ప్రవాసాంధ్ర భరోసా బీమా’
కార్యక్రమాన్ని అమలు చేస్తోందని తెలిపిన వెంకట్ మేడపాటి, ఉద్యోగులు, వలసకార్మికులు, డ్రైవర్లు, హౌస్ మెయిడ్స్, హెల్పర్లకు ఈ పథకం ఎంతో మేలు
చేస్తుందన్నారు. రూ. 275 చెల్లిస్తే మూడేళ్ళకు ప్రమాద బీమా లభిస్తుందన్నారు.విద్యార్థులకు
పూర్తి ఉచితంగా ఈ బీమా ద్వారా భరోసా లభిస్తుందన్నారు.
ఈ ఏడాది
డిసెంబర్ 26 నుంచి వచ్చే ఏడాది జనవరి 15 వరకు ఈ బీమా కోసం పేరు నమోదు చేసుకోవాలని APNRTS సీఈఓ పి. హేమలత రాణి కోరారు. గతంలో
మూడేళ్ళ కాలానికి గాను రూ. 550 ల
ప్రీమియం, విద్యార్థులకు ఏడాదికి రూ. 180 ప్రీమియం ఉండేదన్నారు.
ప్రవాసాంధ్ర
భరోసా బీమా ప్రీమియం కోసం APNRTS
24/7 హెల్ప్‌లైన్ +91-863-2340678, +91 85000 27678 (వాట్సప్) ను సంప్రదించాలని సూచించారు. https://www.apnrts.ap.gov.in/index.php/home/insurance_new
లో లాగిన్ అవ్వడం ద్వారా, insurance@apnrts.com; helpline@apnrts.com కు ఇమెయిల్ చేసి ప్రీమియం పొందవచ్చు.
మరిన్ని వివరాల కోసం https://www.apnrts.ap.gov.in/
ని సందర్శించాలని మేడపాటి వెంకట్
కోరారు.