అమెరికాలోనే హెచ్- 1 బి వీసాలను రెన్యువల్ (H 1B Visa ) చేసుకునే అవకాశం ఉద్యోగులకు లభించింది. వచ్చే ఏడాది జనవరి 29 నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. వీసాల రెన్యువల్ విధానాన్ని మరింత సరళీకరిస్తూ అమెరికా నిర్ణయం తీసుకుంది. మొదటి ఏడాది 20 వేల వీసాలు రెన్యువల్ చేయనున్నారు. తొలిదశలో భారతీయులకు అవకాశం దక్కింది. ఎవరు అర్హులు, ఎలా దరఖాస్తు చేసుకోవాలి అనే విషయాలను యూఎస్ ఫెడలర్ రిజిస్ట్రీ వివరించింది.
ఫైలట్ కార్యక్రమంలో భాగంగా 2024 జనవరి 29 నుంచి ఏప్రిల్ 1 వరకు హెచ్- 1 బి వీసాదారులు అమెరికాలోనే రెన్యువల్ చేసుకోవచ్చు. వారానికి 4 వేల చొప్పున స్లాట్లను ఆన్లైన్లో అందుబాటులో ఉంచనున్నారు. వీటిలో 2 వేలు భారతీయులకు, మరో 2 వేలు కెనడియన్లకు అందుబాటులో ఉంచుతారు. భారతీయులకు జనవరి 29, ఫిబ్రవరి 5, 12, 19, 26వ తేదీల్లో స్లాట్లు అందుబాటులో ఉంటాయి.