వైకుంఠ
ఏకాదశికి తోడు తర్వాతి రెండు రోజులు వరుసగా సెలువులు రావడంతో జ్యోతిర్లింగ
క్షేత్రమైన శ్రీశైలానికి పెద్ద ఎత్తున భక్తులు తరిలివచ్చే అవకాశముందని అధికారులు
భావిస్తున్నారు. అందుకు తగిన ఏర్పాట్లు చేయడంతో పాటు శనివారం నుంచి మూడు రోజులు
ఆర్జిత సేవలు రద్దు చేశారు.
భక్తుల
రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉండటంతో డిసెంబర్ 23,24,25న గర్భాలయ, సామూహిక అభిషేకాలు
నిలిపివేస్తున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. అందుకు ప్రత్యామ్నాయంగా రోజుకు
నాలుగు సార్లు మహాదేవుడి స్పర్శ దర్శనానికి అనుమతి కల్పించారు.
ఏకాదశి
రోజు తెల్లవారు జామున స్వామివారి ఉత్తర ద్వార దర్శనం, రావణ వాహన సేవ
నిర్వహించనున్నారు. అనంతరం ఉత్సవమూర్తులకు ఆలయంలో పూజలు నిర్వహిస్తారు. తర్వాత
స్వామి వారిని ఆలయ ముఖమండప ఉత్తర ద్వారం గుండా బయటకు తీసుకొచ్చి భక్తులు
దర్శించుకునేందుకు అవకాశం కల్పిస్తారు.