త్వరలో జరగబోయే గణతంత్ర వేడుకలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానియేల్ మెక్రాన్‌ను (republic day celebrations) ముఖ్య అతిథిగా ఆహ్వానించినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ముందుగా గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ను ఆహ్వానించారు. పలు కారణాల వల్ల ఆయన హాజరు కాలేనని సమాచారం ఇచ్చారు. దీంతో ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్‌ను ఆహ్వానించినట్లు తెలుస్తోంది.
2023 జులైలో పారిస్‌లో జరిగిన ఫ్రాన్స్ జాతీయ దినోత్సవ బాస్టిల్ డే పరేడ్‌లో ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన జీ 20 సమావేశాలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు హాజరయ్యారు. ఫ్రాన్స్ భారత్ సంబంధాలు మరింత బలోపేతం దిశగా ప్రధాని మోదీతో చర్చలు జరిపారు. ఫ్రాన్స్ బాస్టిల్ డే వేడుకలకు ప్రధాని మోదీ హాజరుకావడాన్ని తమ ప్రజలు గౌరవంగా భావించారని ఆయన గుర్తుచేశారు.