New wed couple jump
into river, bride died
పశ్చిమ గోదావరి జిల్లా సిద్ధాంతం వద్ద
మంగళవారం నాడు ఓ కొత్త జంట వంతెన పైనుంచి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించారు. వారిలో
పెళ్ళికూతురి శవం గురువారం నాడు దొరికింది. మృతురాలి బంధువులు ఆమె భర్తపైనే
అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
(Crime News)
సత్యవాణి (19), శివరామకృష్ణలకు డిసెంబర్
15న పెళ్ళయింది. కొత్త దంపతులు మొదటి రోజు ఉండ్రాజవరం మోర్త గ్రామంలో, రెండో రోజు
పెనుగొండ మండలం వడలి గ్రామంలో గడిపారు. అయితే డిసెంబర్ 19న వారు సిద్ధాంతం వద్ద
వంతెన పైనుంచి గోదావరిలోకి దూకేసారు. (New
wed couple jump into river) శివరామకృష్ణ కిలోమీటరు
దూరం అవతల నదిలో దొరకగా, కొంతమంది అతన్ని వెలికితీసారు. అతను బతికాడు. అయితే
సత్యవాణి మాత్రం దొరకలేదు.
గాలింపు చర్యల్లో భాగంగా, రెండు రోజుల
తర్వాత అంటే గురువారం తెల్లవారుజామున సత్యవాణి మృతదేహం జాలర్లకు దొరికింది. (Bride died) దాంతో యువతి బంధువుల ఆవేదనకు అంతే లేకుండా పోయింది. పెళ్ళయిన ఐదు
రోజులకే ఆత్మహత్య ఎందుకు చేసుకుంటుందని, తప్పకుండా భర్తే ఆమెను హత్య చేసి ఉంటాడనీ
వారు ఆరోపిస్తున్నారు. గురువారం వారు సిద్ధాంతం దగ్గర జాతీయ రహదారిపై బైఠాయించి
ఆందోళన చేసారు. (Kin of bride
trying to test) దాంతో పోలీసులు వారికి నచ్చజెప్పి ఆందోళన
విరమింపజేసారు.
పెనుగొండ సీఐ నాగేశ్వరరావు, ఎస్సై రమేష్,
ఇతర పోలీసులు మృతురాలి బంధువులకు నచ్చజెప్పారు. శివరామకృష్ణ తమ అదుపులోనే ఉన్నాడనీ,
మృతదేహానికి పోస్ట్మార్టం చేస్తే విషయాలు తెలుస్తాయనీ వారిని సముదాయించారు. తగిన
న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో సత్యవాణి బంధువులు ఆందోళన విరమించారు. ఆమె తాత
మొల్లు రామారావు, తన మనవరాలు అనుమానాస్పద స్థితిలో మరణించిందని ఫిర్యాదు చేసారు. ఆ
మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. శివరామకృష్ణను తమ అదుపులోకి
తీసుకున్నారు.
ఈ కేసు విషయంలో కొన్ని కీలక
అనుమానాలున్నాయి. బ్రిడ్జి పైనుంచి దూకిన జంటలో భర్త ఎలా బతికాడు, భార్య ఎలా
మరణించింది అన్న విషయం తేలలేదు. మృతురాలి బంగారు ఆభరణాలు ఏమయ్యాయో తెలియలేదు. భర్త
ఆమెను ముందుగానే హత్య చేసి, తర్వాత కాలువలో తోసేసాడా అని అనుమానిస్తున్నారు.
మరోవైపు, నిందితుడు శివరామకృష్ణ తాను
అమాయకుడినని పోలీసులకు చెప్పాడు. తనతో పెళ్ళి ఇష్టం లేదంటూ, వధువు దాంపత్యానికి
సహకరించలేదనీ, అందువల్ల ఇద్దరమూ కలిసి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నామనీ శివరామకృష్ణ
చెప్పాడు. అతనో చిరుద్యోగం చేసుకుంటూ ఆటో నడుపుకుంటున్నాడు.
నరసాపురం డీఎస్పీ,
పెనుగొండ తహసీల్దార్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. తర్వాత నిందితుడి గురించి, కొత్త
దంపతులు గోదావరిలోకి దూకడం గురించీ ఆమె బంధువులను వాకబు చేసారు, కేసు దర్యాప్తు
కొనసాగుతోంది.