రెజ్లింగ్ సమాఖ్య ఫలితాల తీరుతో
తీవ్రంగా కలత చెందినట్లు రెజ్లర్లు వినేశ్ ఫోగట్, సాక్షి మాలిక్ తెలిపారు.
సమాఖ్య నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన బ్రిజ్ భూషణ్ అనుచరుడు సంజయ్ సింగ్
నాయకత్వంలో తాము కొనసాగలేమంటూ కన్నీళ్ళు పెట్టుకున్నారు.
సాక్షి మాలిక్ సహా
పలువురు రెజ్లర్లు, బ్రిజ్ భూషణ్ కు వ్యతిరేకంగా ఎన్నికల ప్రచారంలో పాల్గోన్నారు. బ్రిజ్ భూషణ్
రెజ్లర్ ఫెడరేషన్ చీఫ్ గా ఉన్నప్పుడు తమను లైగింకంగా వేధించాడని పలువురు రెజర్లు
ఆందోళన చేపట్టారు.
12 ఏళ్ళ పాటు రెజ్లర్ ఫెడరేషన్ లో వివిధ హోదాాల్లో పనిచేసిన బ్రిజ్ భూషణ్ ను తమను వేధించాడని రెజ్లర్లు ఆరోపించడం దుమారం రేపింది. దీంతో ఆయన
ఎన్నికలకు దూరంగా ఉంటూ తన అనుచరుడు,
వ్యాపార భాగస్వామి సంజయ్ సింగ్ ను నిలిపారు.
తాజాగా జరిగిన ఎన్నికల్లో సంజయ్ విజయం సాధించారు.
2010 దిల్లీ కామన్వెల్త్ గేమ్స్ ఛాంపియన్,
రెజ్లర్ అనిత షెరాన్ పై ఆయన గెలిచారు. మొత్తం 47 ఓట్లలో 40 ఓట్లు ఆయన సాధించారు.
రెజ్లర్లు సాక్షి మాలిక్, బజరంగ్ పూనియా, వినేశ్ ఫోగట్ సమాఖ్య ఫలితాలపై అసహనం
వ్యక్తం చేశారు. సంజయ్ సింగ్ ఎన్నికతో మహిళా రెజర్లు వివక్ష ఎదుర్కోవాల్సి
వస్తుందన్నారు. మాలిక్ రిటైర్మెంట్ ప్రకటించగా, ఫోగట్ కన్నీళ్ళు పెట్టుకున్నారు.
దేశంలో న్యాయం ఎలా దొరుకుతుంతో తనకు
తెలియడం లేదని కామన్ వెల్త్, ఆసియా గేమ్స్ లో బంగారు పతకం సాధించిన
ఫోగట్ అన్నారు.
ఎన్నికలకు ముందు తమకు న్యాయం
జరుగుతుందనే నమ్మకం ఉండేదని, కానీ రెజ్లర్ల భవిష్యత్ అంధకారంలో
పడిందని భావోద్వేగానికి గురయ్యారు. తాము ఇంకా పోరాడుతూనే ఉన్నామన్నారు.
తాము మహిళా నాయకురాలు ఉండాలని
ఆశాంచామని, కానీ అది జరగలేదని మాలిక్ అన్నారు.
బ్రిజ్ భూషణ్ అరాచకాలకు వ్యతరేఖంగా పోరాటం చేస్తే ఆయన అనుచరుడే గెలిచాడని దీంతో
మహిళలకు సాంత్వన దక్కదని అందుకే తాను
రెజ్లింగ్ దూరమవుతున్నట్లు సాక్షి మాలిక్ ప్రకటించారు.