దేశంలో కరోనా కొత్త వేరియంట్(covid) కలకలం రేపుతోన్న వేళ ఏపీలోనూ ప్రవేశించిందనే ఆందోళన వ్యక్తం అవుతోంది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన ఓ వృద్ధురాలికి కరోనా సోకిందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రాజమహేంద్రవరంలోని దానవాయిపేటకు చెందిన 84 ఏళ్ల వృద్ధురాలికి కోవిడ్ లక్షణాలు ఉండటంతో మందులు వాడారు.
ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పరీక్షలు జరపగా కోవిడ్ పాజిటివ్ అని తేలింది. దీంతో వైద్య సిబ్బంది నమూనాలను కాకినాడ ఆర్టీడీ పీసీఆర్ కేంద్రానికి పంపించారు. అక్కడ కూడా పాజిటివ్ వచ్చిందని తెలుస్తోంది. అయితేే జిల్లా వైద్యాధికారులు దీన్ని ధ్రువీకరించాల్సి ఉంది. అటు తెలంగాణలోనూ కరోనా కేసులు వెలుగు చూశాయి. తెలంగాణలో ఇప్పటికే నాలుగు కరోనా కేసులు నమోదయ్యాయని తెలుస్తోంది.