దక్షిణాఫ్రికాలోని
పార్ల్ వేదికగా జరిగిన మూడో వన్డేలో సఫారీ జట్టుపై భారత్ భారీ విజయం సాధించింది. 296 పరుగుల లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా బ్యాటర్లు విఫలమయ్యారు.
భారత బౌలర్ల ధాటికి 45.5 ఓవర్లలో
218 పరుగులకే పెవిలియన్ చేరారు. అర్ష్‌దీప్ సింగ్ నాలుగు
కీలకమైన వికెట్లు తీయగా అవేష్ ఖాన్, వాషింగ్టన్
సుందర్‌లు చెరో రెండు వికెట్ పడగొట్టారు.
ముకేశ్
కుమార్, అక్షర్ పటేల్ ఒక్కో వికట్ తీశారు. దీంతో 78 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. ప్రస్తుత పర్యటనలో భాగంగా జరిగిన మూడు
మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 2-1 తేడాతో గెలిచింది.
దక్షిణాఫ్రికా బ్యాటర్లలో టోనీ డీ జోర్జి మాత్రమే 81 పరుగులతో రాణించాడు. మిగతా వారు అంతంతమాత్రంగానే ఆడారు. హెండ్రిక్స్
(19), టోనీ డీ జోర్జి(81), డస్సెన్(2), మార్క్రమ్(36), క్లాసెన్(21), డేవిడ్ మిల్లర్(10), ముల్డర్(1), కేశవ్ మహారాజ్ (14), హెండ్రిక్స్(18), విలియమ్స్(2), బర్గర్(1 నాటౌట్) చొప్పున పరుగులు చేశారు.
అంతకుముందు
టాస్ ఓడి బ్యాటింగ్ చేసి భారత్ నిర్ణీత 50 ఓవర్లలో
8 వికెట్ల నష్టానికి 296 పరుగులు
చేసింది. శాంసన్ సెంచరీ చేయడంతో పాటు యువ
బ్యాటర్లు తిలక్ వర్మ(52), రింకూ
సింగ్ (38) రాణించారు.
రజత్ పటీదార్ (22), సాయి
సుదర్శన్ (10), సంజూ శాంసన్ (108), కేఎల్ రాహుల్ (21), తిలక్
వర్మ (52), రింకూ సింగ్ (38), అక్షర్
పటేల్ (1), వాషింగ్టన్ సుందర్ (14), అర్షదీప్
సింగ్ (7 నాటౌట్), అవేశ్
ఖాన్ (1 నాటౌట్) చొప్పున పరుగులు చేశారు.
దక్షిణాఫ్రికా బౌలర్లలో హెండ్రిక్స్ 3 వికెట్లు, నండ్రె
బర్గర్ 2, విలియమ్స్, వియాన్
ముల్డర్, కేశవ్ మహారాజ్ ఒక్కోటి చొప్పున వికెట్లు తీశారు.
‘ప్లేయర్
ఆఫ్ ది మ్యాచ్’గా సంజూ శాంసన్, ‘ప్లేయర్
ఆఫ్ ది సిరీస్’గా అర్షదీప్ సింగ్ అవార్డులను అందుకున్నారు.
భారత
వన్డే క్రికెట్ జట్టు సారధి కేఎల్ రాహుల్ అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. విరాట్
కోహ్లి తర్వాత సౌతాఫ్రికాను ఆ ఆ దేశంలోనే ఓడించిన కెప్టెన్ గా రికార్డు
సృష్టించాడు.
విరాట్ 2017-18లో తొలిసారి సౌతాఫ్రికాను ఆ దేశంలోని
ఓడించాడు. విరాట్ నాయకత్వంలో మన జట్టు సౌతాఫ్రికాను 5-1 తేడాతో చిత్తు చేసింది.
ఈ
క్యాలెండర్ ఇయర్లో భారత్ కు ఇది 27వ విజయం. ఆస్టేలియా జట్టు 30 మ్యాచులతో మొదటి ప్లేస్ లో ఉంది. 2003లో ఆస్ట్రేలియా జట్టు ఈ ఘనత
సాధించింది.