జమ్మూకశ్మీర్‌లోని పూంఛ్ జిల్లాలో జవాన్ల వాహనంపై ఉగ్రవాదులు కాల్పులకు (encounter) తెగబడ్డారు. ఉగ్రదాడిలో ఐదుగురు జవాన్లు వీరమరణం పొందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గురువారం సాయంత్రం ఈ దాడి చోటు చేసుకుంది. సురాన్‌కోట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ధేరా కి గాలి, బుప్లియాజ్ మధ్య ధత్యార్ మోర్ సమీపంలో ఈ ఘటన జరిగింది.
గాలి ప్రాంతంలో నక్కిన ఉగ్రవాదుల కోసం సైన్యం గాలింపు మొదలు పెట్టింది. ఆ ఆపరేషన్ కోసం అదనపు బలగాలను తరలించే క్రమంలో సైనికుల వాహనంపై ఉగ్రవాదులు విరుచుకుపడినట్లు లెప్టినెంట్ కర్నల్ సునీల్ బర్తవాల్ వెల్లడించారు. ఈ దాడికి తమదే బాధ్యత అంటూ పాకిస్తాన్‌కు చెందిన లష్కరే తయ్యబా అనుబంధ సంస్థ పీపుల్స్ యాంటీ ఫిసిస్ట్ ఫ్రంట్ ప్రకటించింది.