Lok Sabha adjourned sine die: లోక్‌సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు.
షెడ్యూల్ కంటే ఒక రోజు ముందుగానే సెషన్
ముగిసింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 4న ప్రారంభం కాగా పలు కీలక బిల్లులను లోక్ సభ ఆమోదించింది.
నేర న్యాయ
బిల్లులు, ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పీరియాడికల్స్ బిల్లు-2023, సీఈసీ నియామకాల బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది.
ఈ నెల 13న పార్లమెంట్లో జరిగిన భద్రతా వైఫల్యం ఘటన తర్వాత విపక్షాలు పార్లమెంటులో
నిరసన తెలుపుతున్నాయి. ఘటనపై కేంద్రహోంమంత్రి అమిత్ షా వివరణ ఇవ్వాలంటూ
పట్టుబట్టాయి. దీంతో లోక్ సభ నుంచి 100 మందిని రాజ్యసభ నుంచి 46 మంది ని సస్పెండ్
చేశారు.