సభా
నియమావళికి వ్యతిరేకంగా ప్రవర్తించారంటూ లోక్సభ నుంచి మరో ముగ్గురు ఎంపీలను స్పీకర్
ఓంబిర్లా సస్పెండ్ చేశారు. దీంతో సస్పెన్షన్ గురైన ఉభయసభల ఎంపీల సంఖ్య 146కి
చేరింది. కాంగ్రెస్ ఎంపీలు దీపక్ బాజి, డీకే సురేశ్, నకుల్ నాథ్(కాంగ్రెస్ అగ్రనేత
కమల్ నాథ్ కుమారుడు)పై వేటు వేశారు. దీంతో లోక్
సభ నుంచి ఇప్పటి వరకు సస్పెండైన ఎంపీల సంఖ్య 100కి చేరింది. నిన్న ఇద్దరిపై చర్యలు
తీసుకున్నారు.
డిసెంబరు
13న లోక్ సభలో జరిగిన భద్రతా ఉల్లంఘన ఘటన పార్లమెంటు ఉభయ సభలను కుదిపేస్తోంది. ఘటనపై
కేంద్రహోంమంత్రి అమిత్ షా ప్రకటన చేయాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. సభా
నియమవాళికి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ అభ్యంతరకర నినాదాలు చేస్తున్నారు.
సభా కార్యక్రమాలు సజావుగా జరగకుండా అడ్డుకుంటున్నారు. దీంతో విపక్ష సభ్యులను సస్పెండ్
చేస్తున్నారు.
డిసెంబర్
14న 14 మంది ఎంపీలు సస్పెండ్ కాగా, సోమవారం నాడు 78మంది, మంగళవారం 49 మంది, నిన్న
ఇద్దరు, నేడు ముగ్గురు ఎంపీలు సస్పెండ్ అయ్యారు. ఈ శీతాకాల సమావేశాలు ముగిసే వరకు
ఈ క్రమశిక్షణ చర్యలు కొనసాగుతాయని స్పీకర్ స్పష్టం చేశారు. పార్లమెంటు చరిత్రలో
ఇంతమంది సభ్యులు సస్పెండ్ కావడం ఇదే తొలిసారి.
విపక్ష
ఎంపీలు చేపట్టిన ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి
జగదీప్ ధన్ఖర్ ను అవమానించేలా తృణమూల్ ఎంపీ మిమిక్రీ చేయడంపై పాలకపక్షం ఆగ్రహం
వ్యక్తంచేసింది. రాజ్యాంగబద్ద పదవిలో ఉన్న వ్యక్తిని అందునా అంగవైకల్యాన్ని ఎత్తిచూపేలా
అవమానించడాన్ని తప్పుబట్టింది. క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది.