DEO orders not to make
children up as Santa Clause
డిసెంబర్ 25న క్రిస్మస్ పండుగ జరుపుకోవడం
క్రైస్తవులకు అలవాటు. ఆ సందర్భంగా శాంటాక్లాజ్ వేషధారణ చేయిస్తుంటారు. ఐతే బడుల్లో
అలాంటి పనులు చేయకూడదంటున్నారు ఓ అధికారి. పిల్లలను పాఠశాలల్లో శాంటాక్లాజ్ వేషాలు
వేస్తే చర్యలు తప్పవని ఆదేశించారు. ఆ మేరకు మధ్యప్రదేశ్లోని షాజాపూర్ జిల్లా
విద్యాధికారి (డీఈఓ) పేరిట ఒక అధికార పత్రం చెలామణీ అవుతోంది.
క్రైస్తవం భారతదేశానికి సంబంధించిన మతమే
కాదు. ఆ మతంలోనూ జీసస్ క్రైస్ట్ డిసెంబర్ 25న పుట్టాడనడానికి బలమైన సాక్ష్యాలు
లేవు. ఇక శాంటాక్లాజ్ అనే పాత్రే బైబిల్లో ఎక్కడా లేదు. కానీ ప్రతీ యేడాదీ
డిసెంబర్ నెలలో క్రిస్మస్ పండుగ జరుపుకోవడం, ఆ సందర్భంగా పాఠశాలల్లో పిల్లలకు
శాంటాక్లాజ్ వేషాలు వేయడం మన దేశంలో జరిగిపోతూనే ఉంది. ఆ ఆనవాయితీకి అడ్డుకట్ట
వేసాడొక చిన్న ప్రభుత్వాధికారి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని షాజాపూర్ జిల్లా డీఈఓ, తమ
జిల్లాలోని పాఠశాలల యాజమాన్యాలు పిల్లలకు శాంటాక్లాజ్ వేషాలు వేస్తే చర్యలు
తప్పవంటూ ఆదేశించాడు. ఆ మేరకు ఒక పత్రం స్థానికంగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.
ఒకవేళ ఏ పాఠశాల నిర్వాహకులైనా తమ బడిలోని
చిన్నారులకు శాంటాక్లాజ్ వేషాలు వేయదలచుకుంటే వారి తల్లిదండ్రుల నుంచి లిఖితపూర్వక
అనుమతి తీసుకోవడం తప్పనిసరి అని ఆదేశించారు. అలా అనుమతి తీసుకోని పక్షంలో ఆ పాఠశాల
మీద చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసారు. ఒకవేళ ఏ పాఠశాల అయినా తల్లిదండ్రుల
అనుమతి లేకుండా పిల్లలకు శాంటా మేకప్ వేస్తే, తదుపరి ఎదురయ్యే పరిణామాలకు ఆ
పాఠశాలే బాధ్యత వహించాల్సి ఉంటుందని కూడా స్పష్టం చేసారు. షాజాపూర్ జిల్లా
విద్యాధికారి జారీ చేసిన ఈ ఆదేశాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
షాజాపూర్ డీఈఓ పేరిట జారీ
అయిన ఆ ఆర్డర్ కాపీ, జిల్లా కలెక్టర్ మినహా సంబంధిత అధికారులకూ, అన్ని పాఠశాలల
నిర్వాహకులకూ పంపినట్లు ఆ పత్రంలో ఉంది.