Wrestling Federation of
India Elections: Ex chief’s aide wins
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (Wrestling Federation of India – WFI) ఎన్నికల్లో బ్రిజ్భూషణ్శరణ్ సింగ్ సన్నిహిత
సహచరుడు సంజయ్ సింగ్ అధ్యక్ష పదవికి ఎన్నికయ్యాడు. ఫెడరేషన్ మాజీ అధ్యక్షుడు,
బీజేపీ ఎంపీ అయిన బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ లైంగికవేధింపుల ఆరోపణలపై పదవీ
కోల్పోయాడు. అతని స్థానంలో అతని అనుచరుడే గెలిచాడు.
మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ (Brijbhushan Sharan Singh) మీద లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన క్రీడాకారులు మద్దతిచ్చిన
అభ్యర్ధి అనితా షెరాన్ ఓటమిపాలైంది. (Anita
Sheoran) మొత్తం 47 ఓట్లలో సంజయ్ సింగ్ 40 ఓట్లు
గెలుచుకుని దాదాపు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. అనిత కామన్వెల్త్ క్రీడల్లో
స్వర్ణపతకం సాధించింది. సంజయ్‌సింగ్‌కు వ్యతిరేకంగా ఆమెకు కేవలం 7 ఓట్లు మాత్రమే
లభించాయి.
సంజయ్ సింగ్ (Sanjay Singh) ఉత్తరప్రదేశ్‌లోని కైజర్గంజ్ ప్రాంతానికి చెందినవాడు, ఆరుసార్లు
ఎంపీగా ఎన్నికై, 12ఏళ్ళ పాటు పార్టీకి అధ్యక్షుడిగా వ్యవహరించాడు. 2019 నుంచీ
రెజ్లింగ్ ఫెడరేషన్లో వివిధ హోదాల్లో పనిచేసాడు.
మరో ఆసక్తికరమైన పరిణామం ఏంటంటే,
ఉపాధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా కొద్దిరోజుల
క్రితమే ఎన్నికైన మోహన్ యాదవ్ ఓటమి పాలయ్యారు.
రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్ష పదవితో పాటు
ఒక సీనియర్ ఉపాధ్యక్షుడు, నలుగురు ఉపాధ్యక్షులు, ఒక సెక్రెటరీ జనరల్, ఇద్దరు ఉమ్మడి
కార్యదర్శులు, ఐదుగురు ఎగ్జిక్యూటివ్…. పదవుల భర్తీ కోసం ఇవాళ ఎన్నికలు జరిగాయి.
(WFI President Election)
బజరంగ్ పూనియా, సాక్షి మాలిక్, వినేష్
ఫోగట్ తదితర క్రీడాకారులు బ్రిజ్‌భూషణ్ సింగ్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. అతని
కుమారులు, లేదా సహచరులను ఎన్నికలో పాల్గొనబోనివ్వమని వారు చెప్పారు. దాంతో బ్రిజ్‌భూషణ్
కొడుకు ప్రతీక్, అల్లుడు విశాల్ సింగ్, ఎన్నికల బరిలోకి దిగలేదు. అయితే వారి
కుటుంబానికి అత్యత ఆప్తుడైన సంజయ్ సింగ్ నామినేషన్‌ను ఆమోదించారు.
రెజ్లింగ్ ఫెడరేషన్ ఎన్నికలు ఈ యేడాది జులైలో మొదలయ్యాయి. అయితే కోర్టు కేసుల కారణంగా ఆలస్యమవుతూ
వచ్చాయి. ఫలితంగా అంతర్జాతీయ రెజ్లింగ్ సంస్థ భారత రెజ్లింగ్ ఫెడరేషన్‌ను సస్పెండ్
చేసింది.