Kerala Story kind of Love
Jihad incident in Maharashtra
కేరళ స్టోరీ సినిమా విడుదలైనప్పుడు
ముస్లిములు, కాంగ్రెస్ కమ్యూనిస్టు తదితర సెక్యులరిస్టు పార్టీల వారూ దేశం మొత్తం
రచ్చ చేసేసారు. ఆ సినిమా అంతా అబద్ధాల పుట్ట అనీ, అసలు అలాంటి ఘటనలు దేశంలో జరగనేలేదనీ,
హిందుత్వవాదులు పనిగట్టుకుని ఇస్లాంను, ముస్లిములను అపప్రథల పాలు చేస్తున్నారనీ
గగ్గోలు పెట్టారు. స్వయానా బాధితులే వచ్చి ముంబైలో ప్రెస్‌మీట్ పెట్టి తమ బాధలు
చెప్పినా ముస్లిములు, వారికి వంతపాడే దొంగ లౌకికవాదులు, ఎర్రజెండాల వారు, మూడు
రంగుల జెండాలవారు కనీసం చెవి ఒగ్గలేదు. నిజానికి అలాంటి ఘటనలు దేశంలో కోకొల్లలుగా
జరుగుతున్నాయి. అవన్నీ బైటపడడం లేదు. ఏ బురఖాల మాటునో కప్పబడిపోతున్నాయి. అలాంటి
సంఘటన తాజాగా మహారాష్ట్రలో వెలుగు చూసింది.
మహారాష్ట్ర పోలీసులు అహ్మద్‌నగర్ జిల్లా శ్రిగొండా (Srigonda, Maharashtra) ప్రాంతానికి చెదిన మైనర్ బాలికపై లైంగికదాడి చేసిన ఆరోపణలపై జీషన్ అనే ముస్లిం యువకుడి
మీద కేసు నమోదు చేసారు. అతనికి సహకరించినందన్న ఆరోపణలపై ఒక ముస్లిం అమ్మాయి మీద
కూడా కేసు పెట్టారు. జీషన్, బాధితురాలిని అభ్యంతరకరంగా ఫొటోలు తీసి, వాటితో ఆమెను
బ్లాక్మెయిల్ చేసి ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. (Love Jihad kind of case)
బాధిత మైనర్ బాలిక మహారాష్ట్రలోని అహ్మద్
నగర్ జిల్లా షిండేవాడీ గ్రామస్తురాలు. ఆమె సమీపంలోని శ్రిగొండా అనే ఊళ్ళో మహారాజా జీవాజీరావు
షిండే కళాశాలలో చదువుకొంటోంది. ఆ ఊరికి చెందిన జీషన్ అనే ముస్లిం యువకుడు తనను బ్లాక్మెయిల్ చేస్తున్నాడనీ, తనతో లైంగిక
సంబంధం పెట్టుకోవాలని బెదిరిస్తున్నాడనీ ఆమె తన తల్లికి ఈ నెల 14న ఫోన్ చేయడంతో
విషయం వెలుగులోకి వచ్చింది.
17ఏళ్ళ కూతురి ఫోన్‌తో కంగారుపడిన తల్లి
వెంటనే శ్రిగొండాకు పరుగెత్తుకు వెళ్ళింది. అక్కడ బాధితురాలు తన తల్లికి తన
పరిస్థితి వివరించింది. నిరంతరాయంగా వేధింపులు, బెదిరింపులు, బ్లాక్‌మెయిలింగ్‌తో
ఆమె పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది.
బాధితురాలికి కళాశాలలో ఒక స్నేహితురాలు
ఉంది. ఆమె ఈ యేడాది ఆగస్టులో జీషన్‌ను తన సోదరుడిగా బాధితురాలికి పరిచయం చేసింది. అతను
బాధితురాలితో స్నేహం చేయాలనుకుంటున్నాడని ఆమెపై ఒత్తిడి తెచ్చింది. బాధితురాలు మొదట
నిరాకరించినా, స్నేహితురాలు బలవంతం చేసి వారిద్దరికీ పరిచయం చేసింది. (Muslim girl trapped Hindu friend)
పరిచయం తర్వాత కూడా ఆ స్నేహితురాలి ప్రోద్బలంతోనే
జీషన్ బాధిత బాలికను కలుస్తుండేవాడు. ఆమెకు తెలియకుండానే ఆమె ఫొటోలు తీసాడు.
క్రమంగా జీషన్ ఆ బాలికను ఫోన్లో వేధించడం మొదలుపెట్టాడు. స్నేహితురాలు
మధ్యవర్తిగా ఉండి జీషన్ ఫోన్‌కాల్స్‌ను బాధితురాలికి చేరవేసేది. బాధిత బాలిక తిరస్కరించడంతో
జీషన్ ఆమెను బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. ఆమె అభ్యంతరకర ఫొటోలు తన దగ్గర ఉన్నాయని,
వాటిని ఆమె గ్రామంలో పంచిపెడతాననీ బెదిరించసాగాడు.
సెప్టెంబర్ 25న పరిస్థితి మరింత
చెయ్యిదాటిపోయింది. జీషన్ బాధితురాలిని తనతో పాటు హోటల్‌కి రావాలని నిర్బంధించాడు.
అలా రాకపోతే ఆమె ఫొటోలను చూపించి గ్రామంలో ఆమె పరువు తీసేస్తానని బెదిరించాడు.
పరువు పోతుందని భయపడి బాధితురాలు లాడ్జికి వెళ్ళింది. అక్కడ జీషన్ కత్తితో
బెదిరించి ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని
బెదిరించాడు. (Sexual Assault, Blackmailing, Threatening)
నిందితుడు అక్కడితో ఆగలేదు. బాధితురాలిని
అత్యాచారం చేసిన ఘటనను రికార్డ్ చేసాడు. ఆమెను అసభ్యంగా ఫొటోలు తీసాడు. వాటితో
ఆమెను బ్లాక్మెయిల్ చేసి తన కోరికలు తీర్చుకోడం మొదలుపెట్టాడు.
విషయం తెలిసిన బాధిత
బాలిక తల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు జీషన్ మీద, అతని సోదరి
మీద ఐపీసీ సెక్షన్లు 376, 376(2)(1), అలాగే పోక్సో చట్టం సెక్షన్లు 4, 11, 12, 17
ప్రకారం కేసు రిజిస్టర్ చేసారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.