Leif Erikson Lunar
Prize: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ISRO) ను మరో ప్రతిష్టాత్మక పురస్కారం వరించింది. చంద్రయాన్-3
ప్రయోగంలో విజయం సాధించినందుకు గాను లీఫ్
ఎరిక్సన్ లూనర్ ప్రైజ్ అవార్డు-2023ను ఇస్రోకు అందజేస్తున్నట్లు ఐస్‌ల్యాండ్ కు చెందిన
ఎక్స్‌ప్లోరేషన్ మ్యూజియం వెల్లడించింది.
చంద్రుడి గురించిన అన్వేషణలో భాగంగా దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన ఇస్రో తిరుగులేని
స్ఫూర్తిని ప్రదర్శించిందని రెయ్ కావిక్ లోని భారత రాయభార కార్యాలయం పేర్కొంది.
క్రిస్టోఫర్ కొలంబస్ కంటే 400 ఏళ్ళు
ముందు అమెరికాలో కాలుమోపిన తొలి యూరేపియన్ లీఫ్ ఎరిక్సన్ కు గుర్తుగా ఈ అవార్డును హుసావిక్ లోని ఎక్స్ ప్లోరేషన్ మ్యూజియం 2015
నుంచి అందజేస్తోంది.
ఇస్రో తరఫున భారత రాయబారి బి. శామ్ ఈ
అవార్డు అందుకున్నారు. ఐస్‌ల్యాండ్ కు థ్యాంక్స్ చెబుతూ ఇస్రో చైర్మన్ సోమనాథ్ ఓ
వీడియో సందేశాన్ని విడుదల చేశారు.
చంద్రుడిపై అన్వేషణలో భాగంగా ఇస్రో చేపట్టిన
ప్రయోగాల్లో చంద్రయాన్-3 మూడోది.
ఈ మిషన్ ‘సాఫ్ట్
ల్యాండింగ్’ వీడియో ఈ ఏడాది యూట్యూబ్‌లో అత్యధిక మంది వీక్షించారు. సాఫ్ట్
ల్యాండింగ్ ప్రత్యక్ష ప్రసారాన్ని 85 లక్షలకుపైగా వీక్షించారు. 2023 ఏడాదికి సంబంధించి భారత్ లో అత్యధిక మంది వీక్షించిన టాప్-15 వీడియోల జాబితాను
‘యూట్యూబ్ ఇండియా’ బుధవారం విడుదల చేసింది.