ఎక్స్ సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సామాజిక మైక్రో బ్లాగింగ్ సైట్ ఎక్స్ (ట్విట్టర్) సేవలకు ప్రపంచ వ్యాప్తంగా అంతరాయం ఏర్పడింది. భారత్ సహా ప్రపంచ దేశాల్లో ఎక్స్ (X Twitter) సేవలు నిలిచిపోయాయి.ఎక్స్ ఖాతా తెరవగానే ఖాళీగా కనిపిస్తోందని యూజర్లు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.
ఎక్స్‌లో అన్ని సేవలు నిలిచిపోయాయి. ఫాలోయింగ్, ఫర్ యూ, లిస్ట్ పేజీలు కూడా ఖాళీగానే దర్శనమిస్తున్నాయి. ఎక్స్ ప్రీమియం, ఎక్స్ ప్రో వెర్షన్లు కూడా కనిపించడం లేదు. ఇటీవల ఎక్స్‌లో ఇలాంటి సమస్యలే తలెత్తాయి. సిబ్బందిలో భారీగా కోత వేయడం, సాంకేతిక సమస్యలు తలెత్తడంతోనే సేవలు నిలిచిపోతున్నాయని యూజర్లు భావిస్తున్నారు. ఎక్స్‌కు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది యూజర్లు ఉన్నారు. సేవలకు అంతరాయం కలగడంతో సోషల్ మీడియాలో ఎక్స్‌పై వారి అభిప్రాయలు తెలియజేస్తూ కామెంట్లు చేస్తున్నారు.