అసలు తాళం చెవి కనిపించకపోవడంతో, డూప్లికేట్ తాళం చెవి (crime news) తయారు చేయించేందుకు హైదరాబాద్ మధురానగర్ సమీపంలో సిద్ధార్థనగర్ వాసి సూర్యానారాయణ ఇద్దరు వ్యక్తులను పిలిపించాడు. ఇంటి యజమానిని మాటల్లోపెట్టి దుంగడులు బంగారం లేపేశారు. తరవాత ఎంత ప్రయత్నించినా బీరువా తెరుచుకోవడం లేదంటూ, దుండగులు ఇంటి నుంచి వెళ్లిపోయారు. ఆ తరవాత అసలు తాళం చెవి కనిపించడంతో సూర్యనారాయణ బీరువా తెరిచారు. 50 తులాల బంగారు ఆభరణాలు కనిపించకపోవడంతో మధురానగర్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
బంగారం చోరీ డూప్లికేట్ తాళం చెవి తయారు చేస్తామని వచ్చిన వారిపనేనని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి, సమీపంలోని సీసీ కెమెరా ఫుటేజీ పరిశీలిస్తున్నారు. దుండగులను గుర్తించేందుకు ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపారు.