అయోధ్య
రామమందిరంలో రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ట సందర్భంగా ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి.
జనవరి 22న రామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ట సందర్భంగా అయోధ్య ఇప్పటికే పండగ వాతావరణం
మొదలైంది. ఆద్మాత్మిక పర్యాటకుల రాకతో శ్రీరాముడి జన్మస్థలిలో సందడి వాతావరణం
ఏర్పడింది.
దేశవ్యాప్తంగా పూజలు అందుకున్న రాములోరి పాదుకలు ఇప్పటికే అయోధ్య
చేరుకున్నాయి.
అయోధ్యలో
ప్రతిష్టా కార్యక్రమం సందర్భంగా 108 అడుగుల పొడవైన అగరబత్తీని కూడా సిద్ధం చేస్తున్నారు.
గుజరాత్ లోని వడదోరలో దీనిని తయారీ చేయించారు.
జనవరి
22న నిర్వహించనున్న ప్రారంభోత్సవానికి హాజరయ్యే అతిథులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా
పెద్ద ఎత్తున మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నారు.
అయోధ్య
లోని అంతర్జాతీయ ఎయిర్ పోర్టు ఫేజ్-1 పనులు ఈ నెలాఖరకు పూర్తి కానున్నాయి.
అయోధ్య
డెవలెప్మెంట్ కు రూ. 50 కోట్లు, రామోత్సవ్ 2023-24కు రూ.100కోట్లు, ఇంటర్నేషనల్
రామాయణ్, వైదిక్ ఇన్స్టిట్యూట్ విస్తరణకు రూ. 25 కోట్లను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం
తన సప్లమెంటరీ బడ్జెట్ లో కేటాయించింది.