భారత్-అమెరికా
బంధం దృఢమైందన్న ప్రధాని మోదీ దానిని చిన్నచిన్న ఘటనలతో ముడిపెట్టడం సరికాదన్నారు.
అమెరికాకు చెందిన ఫైనాన్షియల్ టైమ్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోదీ ఈ మేరకు
వ్యాఖ్యానించారు.
అమెరికన్-కెనడియన్,
ఖలిస్తానీ తీవ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర ఆరోపణలను పరిశీలించాల్సి
ఉందన్నారు. అయినా ఇలాంటి ఘటనలు భారత్- అమెరికా సంబంధాలపై ప్రభావం చూపలేవని విశ్వాసం వ్యక్తం చేశారు.
పన్నూ
హత్యకు కుట్రపై అమెరికా ఫెడరల్ ప్రాసిక్యూటర్, భారతీయుడైన నిఖిల్ గుప్తా పై
ఆరోపణలు చేసిన తర్వాత మొదటి సారి స్పందించిన మోదీ, ఆరోపణలకు సంబంధించిన సమాచారం అందజేస్తే దానిని
పరిశీలిస్తామన్నారు. భారతీయ పౌరులు చేసిన మంచైనా చెడైనా చట్టానికి అనుగుణంగానే తమ
ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు.
భారత్-అమెరికా
మధ్య దృఢమైన ద్వైపాక్షిక సంబంధం ఉందన్న నరేంద్రమోదీ, ఇది పరిణతి చెందిన స్థిరమైన
భాగస్వామ్యానికి స్పష్టమైన సూచిక అని అభివర్ణించారు. 2014లో భారత ప్రధానిగా నరేంద్ర
మోదీ బాధ్యతలు చేపట్టిన తర్వాత నుంచి తరచుగా అమెరికాలో పర్యటిస్తున్నారు. భద్రత,
తీవ్రవాదం అణచివేతకు అగ్రరాజ్యం సహకరించాలని కోరారు.
భారత
పౌరులు ఇతర దేశాల్లో ఏదైనా చేసినట్లు సమాచారం అందజేస్తే దానిపై విచారణ జరిపేందుకు
ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అలాగే భారత్ కు వ్యతిరేకంగా కొన్ని ఉగ్రవాద సంస్థలు విదేశాల
వేదికగా కార్యకలాపాలు జరపడం ఆందోళనకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
పన్నూ
హత్యకు పథక రచనలో నిఖిల్ గుప్తా ప్రమేయం ఉందని అమెరికా ఆరోపించింది.
భారత ప్రభుత్వ
అధికారి నుంచి అందిన ఆదేశాల మేరకే నిఖిల్ గుప్తా కుట్రలో భాగమయ్యాడని ఆరోపించింది.
దీనిని భారత్ తిప్పికొట్టింది. ఈ కేసులో అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసి
విచారణ జరుపుతామన్నారు.
నిఖిల్ గుప్తాను ఈ ఏడాది జూన్ లో చెక్ రిపబ్లిక్
అధికారులు అరెస్టు చేసి ప్రేగ్ లోని ఓ జైల్లో ఉంచారు. అతడిని తమకు అప్పగించాలని
అమెరికా కోరుతోంది.