IPL 2024 PLAYER AUCTION:
దుబాయ్
వేదికగా జరిగిన ఐపీఎల్ వేలం(IPL AUCTION )
ఓ రేంజ్ లో జరిగింది. ఐపీఎల్ చరిత్రలో అత్యధికంగా చెల్లింపులు జరిగాయి. ఇండియన్
ప్రీమియర్ లీగ్ చరిత్రలో మిచెల్ స్టార్క్ అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు.
ఆస్ట్రేలియా
పేసర్ గా ఉన్న మిచెల్ స్టార్క్ ను కోల్కతా నైట్ రైడర్స్ రూ.24.57 కోట్లకు
దక్కించుకుంది. దిల్లి క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ అతడి కోసం పోటీపడ్డాయి. రూ.
9.8 కోట్ల దగ్గర కోల్కతా నైట్ రైడర్స్ రేసులో దిగగా, గుజరాత్ టైటాన్స్
ప్రవేశించడంతో వేలం అంచనాలు మించి సాగింది.
ఆస్ట్రేలియా
కెప్టెన్ కమిన్స్ కోసం సన్రైజర్స్ హైదరాబాద్ ఏకంగా రూ.20.50 కోట్లు చెల్లించింది.
న్యూజీలాండ్ ఆల్ రౌండర్ డరిల్ మిచెల్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ రూ. 14 కోట్లు
ఖర్చు చేసింది. ప్రాంచైజీలు మొత్తం 72 మంది ఆటగాళ్ళను కోనుగోలు చేయగా అందులో 30
మంది విదేశీ ఆటగాళ్ళు ఉన్నారు.
ఆస్ట్రేలియాకు చెందిన స్పెన్సర్ జాన్సన్
రూ.10 కోట్లతో సంచలనం
సృష్టించాడు. గుజరాత్ టైటాన్స్ అతడిని సొంతం చేసుకుంది.
దక్షిణాఫ్రికాకు
చెందిన రిలీ రూసో ను పంజాబ్ కింగ్స్ రూ.8 కోట్లతో సొంతం చేసుకుంది. ఇంగ్లండ్
పేసర్ డేవిడ్ విల్లీని రూ.2 కోట్లతో లక్నో సూపర్ జెయింట్స్
దక్కించుకోగా ఇంగ్లండ్ ఆటగాడు టామ్ కరన్ ను రూ.1.5 కోట్లతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కొనుగోలు చేసింది.
వేలంలో
అత్యధిక ధర పలికిన భారతీయ ఆటగాడిగా హర్షల్ పటేల్ నిలిచాడు. గుజరాత్, లఖ్ నవూను
వెనక్కినెట్టి పటేల్ ను రూ. 11.75 కోట్లకు పంజాబ్ కొనుగోలు చేసింది. రూ. 4 కోట్ల
ధర పలికిన శార్దూల్ ఠాకూర్ చెన్నై గూటికి చేరాడు. జైదేవ్ ఉనద్కత్ కోసం సన్ రైజర్స్
రూ.1.60 కోట్లు చెల్లించింది.
తెలుగు
ఆటగాళ్ళలో కేఎస్ భరత్ ను కోల్ కతా రూ. 50 లక్షలకు దక్కించుకోగా, అవనీశ్ రావు రూ.
20 లక్షలకు చెన్నై కొనుగోలు చేసింది.
ఆంధ్రా టీమ్ కు ఆడుతున్న రికీ భుయ్ ను రూ. 20
లక్షలకు దిల్లీ కొనుగోలు చేయగా, హైదరాబాద్ కు ఆడుతున్న మరో ఆటగాడు తనయ్ త్యాగరాజన్
ను రూ. 20 లక్షలకు పంజాబ్ సొంతం చేసుకుంది.
కేవలం రూ.20 లక్షల బేస్ ధరతో ఉన్న రాబిన్ మింజ్ అనే ఓ కుర్రాడి కోసం గుజరాత్ టైటాన్స్ ఏకంగా రూ.3.6 కోట్లు ఖర్చు
చేసింది.