మూడు వన్డేల సిరీస్లో భాగంగా బుధవారం
జరిగిన రెండో మ్యాచులో భారత్ పై దక్షిణాఫ్రికా విజయం సాధించింది. దక్షిణాఫ్రికా
ప్లేయర్ టోనీ డి జోర్జి అజేయ సెంచరీతో
చెలరేగడంతో 212 పరుగుల లక్ష్యాన్ని 42.3 ఓవర్లలోనే ఛేధించి 8 వికెట్ల
తేడాతో విజయాన్ని అందుకుంది. ఇరు జట్ల రేపు ఆఖరి వన్డే జరగనుంది.
డి జోర్జి(119 నాటౌట్), రీజా హెండ్రిక్స్(52) రాణించి తొలి వికెట్కు వీరిద్దరూ 130 పరుగులు జోడించారు. మిగతా
బ్యాటర్లలో డస్సెన్ (36), మార్ర్కమ్ (2 నాటౌట్) పరుగులు చేయడంతో గెలుపు దక్కింది. దక్షిణాఫ్రికా
విజయంతో 3 వన్డేల
సిరీస్ 1-1తో సమానమైంది. భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్, రింకూ సింగ్ చెరో వికెట్
పడగొట్టారు.
దక్షిణాఫ్రికా బౌలింగ్ ధాటికి
భారత్ బ్యాటర్లు చేతులెత్తేశారు.
46.2 ఓవర్లలో 211 పరుగులకే రాహుల్ సేన పెవిలియన్
చేరింది. సాయి సుదర్శన్ (62), కెప్టెన్ రాహుల్ (56) మినహా మరెవరూ చెప్పోకదగిన స్కోర్
చేయలేదు.
రుతురాజ్ గైక్వాడ్ (4), తిలక్ వర్మ (10), సంజూ శాంసన్ (12), రింకూ సింగ్ (17), అక్షర్ పటేల్ (7)
పేలవ ప్రదర్శనతో నిరాశ పరిచారు. దక్షిణాఫ్రికా జట్టులో నాండ్రే బర్గర్ 3, బ్యూరాన్ హెండ్రిక్స్ 2, కేశవ్ మహరాజ్ 2, లిజాద్ విలియమ్స్ , కెప్టెన్ ఐడెన్ మార్ క్రమ్
చెరొక వికెట్ తీశారు.