విపక్షాలకు
చెందిన 95 మంది ఎంపీల సస్పెన్షన్ వేటుపడటంతో లోక్సభలో ప్రతిపక్షాల బలం మూడింట ఒక
వంతుకు తగ్గింది. ఈ సమయంలో నేర చట్టాల స్థానంలో కొత్త డ్రాప్టులను సభ పరిశీలన, ఆమోదం
కోసం పాలకపక్షం ప్రవేశపెట్టడాన్ని ఇండీ కూటమి తప్పుపడుతోంది.
CRPC ACT
1898, IPC యాక్ట్ 1860, IEA 1872 స్థానంలో ఎన్డీయే ప్రభుత్వం , భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్
సురక్ష సంహిత, భారతీయ సాక్ష్యా అధినియం బిల్లులను ఈ ఏడాది ఆగస్టులో ప్రవేశపెట్టింది. పార్లమెంటరీ ప్యానల్ సిఫార్సు మేరకు వాటిని విరమించుకున్న
కేంద్రప్రభుత్వం పలు సవరణలతో డ్రాఫ్టులను మళ్ళీ చట్ట సభ ముందుకు గతవారం
తీసుకొచ్చింది.
కొత్త
డ్రాఫ్టులను సభ పరిశీలనకు స్పీకర్ అనుమతించారు. మంగళవారం సాయంత్రం వీటిని చట్ట సభ్యుల ముందుకు తీసుకొచ్చారు.
భారతీయ న్యాయ సంహిత(రెండోవ)-2023, భారతీయ సాక్ష్యా బిల్లు (రెండోవ)-2023, భారతీయ
నాగరిక్ సురక్ష(రెండోవ)బిల్లు-2023 పరిశీలనకు సభ అనుమతిచ్చింది.
పార్లమెంటులో
భద్రతా వైఫల్యం ఘటనకు సంబంధించి హోంమంత్రి అమిత్ షా వివరణ ఇవ్వాలంటూ విపక్షాల
సభ్యులు పట్టుబట్టి నినాదాలు చేయడంతో ఇప్పటి వరకు 141 మంది రాజ్యసభ, లోక్ సభ
సభ్యులపై సమావేశాలు ముగిసే వరకు సస్పెన్షన్ వేటు వేశారు. నియంత పాలనలో భాగంగానే
విపక్షాల సభ్యులను సస్పెండ్ చేసి ముఖ్యమైన చట్టాలు తీసురావాలనకుంటున్నారని, అలాంటి
వైఖరి సరికాదని విపక్ష సభ్యులు ఆరోపిస్తున్నారు.