ఓ
రామభక్తుడు ప్రత్యేకంగా తయారు చేయించిన శ్రీరాములువారి పాదుకలు నేడు అయోధ్యకు
చేరుకున్నాయి. దేశవ్యాప్తంగా శ్రీరాముడి నడిచిన ప్రాంతమంతటా పూజలు అందుకున్న పరమ
పవిత్ర పాదుకలు, రామ్ లల్లా విగ్రహ ప్రతిష్టా కార్యక్రమం కంటే ముందుగానే అయోధ్య
చేరుకున్నాయి. ఈ పాదుకల బరువు 9 కేజీలు కాగా వీటి తయారీకి ఒక కేజీ బంగారంతో పాటు 8
కేజీల వెండి వాడారు.
హైదరాబాద్ కు చెందిన
అయోధ్య భాగ్యనగర సేవా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు చల్లా శ్రీనివాస మూర్తి వీటిని తయారు
చేయించారు. భవ్య రామమందిరంలో రామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరిగిన తర్వాత
వీటిని కూడా ప్రతిష్టిస్తారు.
బెంగళూరుకు
చెందిన రాజేంద్ర ప్రసాద్ అనే ఓ భక్తుడు అయోధ్య రామమందిర కోసం 48 గంటలను విరాళంగా
అందజేస్తున్నాడు. తమళినాడులోని నమక్కల్ కు చెందిన ఓ కళాకారుడు వీటిలో 42 గంటలను
ఇప్పటికే తయారు చేశాడు. వీటి బరువు1200 కేజీలు కాగా రామ మందిర ప్రారంభోత్సవం
సందర్భంగా 108 గంటలు అవసరం.