Video From Deep Space
అంతరిక్ష
పరిశోధనల్లో నాసా మరో ఘనత సాధించింది. లేజర్ కమ్యూనికేషన్ వ్యవస్థ ద్వారా అంతరిక్షం
నుంచి తొలి అల్ట్రా హెచ్డీ వీడియోను భూమికి చేరవేసే ప్రయోగంలోవిజయం సాధించింది. సుమారు
31 మిలియన్ కిలోమీటర్ల దూరం నుంచి ఈ వీడియోను ప్రసారం చేయగల్గడం విశేషం.
ఇది, భూమి-
చంద్రుడి మధ్య దూరం కంటే 80 రెట్లు ఎక్కువ. ఈ వీడియో నిడివి15 సెకన్లు కాగా,
అందులో టాటర్స్ అనే పిల్లి లేజర్ లైట్ ను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు
కనిపిస్తోంది. ఈ సాంకేతికత ద్వారా భవిష్యత్తులో అంతరిక్షం నుంచి భూమి
మీదకు డేటా పంపేదుకు అలాగే మానవ సహిత అంగారక యాత్రకు ఈ ప్రయోగం దోహదపడనుంది.
అంగారక-గురు గ్రహాల మధ్య ఉంటూ సూర్యుని కక్ష్యలో
తిరుగుతున్న గ్రహశకలం పైకి నాసా ‘సైకీ’ అనే వ్యోమనౌకను పంపింది.
దీనిలో ట్రాన్సీవర్ భూమి మీదకు లేజర్ సంకేతాన్ని పంపగల్గింది.
వ్యోమనౌక నుంచి ఎన్‌కోడెడ్ ఇన్ఫ్రారెడ్ సిగ్నల్‌ను
అమెరికాలోని శాన్ డియాగో కౌంటీలో ఉన్న ‘కాల్టెక్ పలోమర్ అబ్జర్వేటరీ’
కేంద్రంలోని ‘హాలే టెలిస్కోప్’ అందుకుంది. దానిని దక్షిణ కాలిఫోర్నియాలోని నాసా
జెట్ ప్రొపల్షన్ పరిశోధనాశాలకు పంపగా అక్కడ వీడియోను డీకోడ్ చేశారు. ఈ విషయాన్ని జేపీఎల్ ప్రాజెక్ట్ మేనేజర్ బిల్ క్లిప్స్టెయిన్
తెలిపారు.