AP Govt dual standards
between Hindus and Muslims
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్
జగన్మోహన్ రెడ్డి ఇటీవల కేంద్రప్రభుత్వానికి లేఖ రాసారు. రాష్ట్రం నుంచి హజ్
యాత్రకు వెడుతున్న ముస్లిముల (Haz
Pilgrims) వద్ద వసూలు చేస్తున్న చార్జీలను తగ్గించాలని ఆ
లేఖలో కోరారు. అయితే, ఇదే ప్రభుత్వం (AP
Government) ఇదే రాష్ట్రంలోని దేవాలయాల దర్శనాలకు
వెడుతున్న హిందువుల నుంచి(Hindu Pilgrims) పెద్దమొత్తంలో డబ్బులు కొట్టేస్తోంది. అలా హిందువులు, ముస్లిముల మధ్య
ద్వంద్వ ప్రమాణాలు (Dual Standards)
పాటిస్తోంది. హిందువులను నిలువుదోపిడీ చేస్తూ,
ముస్లిములను బుజ్జగించే ప్రయత్నాలు చేస్తోంది. (Religious discrimination)
ఆంధ్రప్రదేశ్ నుంచి హజ్ యాత్రకు వెళ్ళే
ముస్లిములు విజయవాడ సమీపంలోని గన్నవరం విమానాశ్రయం నుంచి తమ విమాన ప్రయాణం
చేస్తారు. అయితే వారి దగ్గర నుంచి వసూలు చేస్తున్న మొత్తం తెలంగాణ, తమిళనాడు,
కర్ణాటక రాష్ట్రాలలో కంటె ఎక్కువగా ఉంటోంది. ఈ యేడాది ఆ తేడా సుమారు 85వేల రూపాయలు
ఉంది. ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళే హజ్ యాత్రికుల నుంచి, పొరుగు రాష్ట్రాల యాత్రికులతో
సమానంగానే చార్జీలు వసూలు చేయాలని జగన్ కేంద్రాన్ని కోరుతున్నారు. ఆ మేరకు కేంద్ర
మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి స్మృతీ ఇరానీకి జగన్ లేఖ రాసారు.
నిజానికి జగన్ గతేడాది కూడా ఇలాంటి లేఖనే
కేంద్రానికి రాసారు. అయితే కేంద్ర ప్రభుత్వం అప్పుడే అది సాధ్యం కాదని స్పష్టంగా
వెల్లడించింది. హజ్ యాత్రికులు ప్రయాణించే విమానాశ్రయాల్లో గన్నవరాన్ని ఆఖరి
నిమిషంలో చేర్చారు. అక్కడినుంచి పనిచేస్తున్న విమానయాన సంస్థలు ఎక్కువ ధరకు బిడ్లు
వేసినందున హజ్ యాత్ర ధరలను తగ్గించడానికి కుదరదని స్పష్టం చేసాయి. అందువల్ల
విజయవాడ నుంచి హజ్ యాత్రకు వెళ్ళాలంటే ధర ఎక్కువవుతుంది. దాన్ని తగ్గించడం తమ
చేతిలో లేదని కేంద్రం స్పష్టం చేసింది. అయినప్పటికీ అదే విజ్ఞప్తితో మళ్ళీ ఇప్పుడు
మరో లేఖ రాసారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి చర్యలు ముస్లింలను
బుజ్జగించే ప్రయత్నాలు అని స్పష్టంగా తెలుస్తోంది. ముస్లిం హజ్ యాత్రికుల విషయంలో
వారికి ఆర్థిక వెసులుబాటు కల్పించాలని కోరుతున్న రాష్ట్ర సర్కారు, హిందువుల
విషయంలో మాత్రం తీవ్రమైన వివక్ష చూపిస్తోంది. హిందూ భక్తుల నుంచి
పుణ్యక్షేత్రాల్లో రకరకాల పేర్లతో డబ్బులు దోచేస్తోంది. వివిధ దర్శనాల చార్జీలను
భారీగా పెంచేసింది.
తిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయం సంగతే
చూద్దాం. జగన్ పదవిలోకి రావడానికి ముందు, ఇప్పుడు అక్కడ టికెట్ల ధరలు ఎలా ఉన్నాయో
పరిశీలిద్దాం.
రూ. 300 టికెట్లు ఒకప్పుడు సాధారణంగా
మూడు నాలుగు రోజుల ముందు ఆన్లైన్లో సులువుగా దొరికేవి. కానీ ఇప్పుడు పద్ధతి
మార్చేసారు. మూడు నెలల ముందు టికెట్లు ఇచ్చే పద్ధతి ప్రవేశపెట్టారు, ముందుగా బుక్
చేసుకోవాలని నియమం చేసారు. కానీ ఆన్లైన్లో టికెట్ స్లాట్ ఓపెన్ అయిన పది పదిహేను
నిమిషాలలోనే నెల రోజుల టికెట్లూ అయిపోతున్నాయి. లేదంటే రూ.500 సేవాటికెట్లు
విక్రయిస్తున్నారు. అంటే దర్శనానికి రూ.300, సేవ పేరుతో రూ. 200 అదనంగా
తీసుకుంటున్నారు. ఆ టికెట్లు బ్రోకర్ల దగ్గరే లభిస్తాయి. వారు పరిస్థితిని బట్టి ఈ
టికెట్లను రూ.1000 వరకూ పెంచి అమ్ముకుంటున్నారు.
ఇక వసతి సదుపాయాల సంగతి చూస్తే, ఒకప్పుడు
గదుల రేట్లు రూ.50, రూ.100, రూ.250, రూ.450గా ఉండేవి. అవి కూడా తిరుమలలోని సీఆర్ఓ
కార్యాలయం దగ్గర గరిష్టంగా గంటన్నర లోపు దొరికేవి. ఇప్పుడు ఆ గదుల రేట్లను రూ.
500, రూ.1000, రూ. 1500, రూ.2500కు పెంచేసారు. అంటే మొదటి రెండు రకాల రూముల
అద్దెలు పది రెట్లు, తర్వాతి రెండు రకాల రూముల అద్దెలు ఆరు రెట్లు పెంచేసారు. అవి
కూడా కోటా పద్ధతిలో 2 నుంచి 3 నెలల ముందు టీటీడీ సైట్ లేదా యాప్‌లో బుక్ చేసుకోవాలి. అది కూడా ఒక్కరోజుకే
ఇస్తారు. అదే సమయంలో బ్రోకర్లు మాత్రం ఎక్కువ వసూలు చేసి ఎన్నిరోజులు కావాలంటే
అన్ని రోజులకు వసతి కల్పిస్తారు.
ఇక కళ్యాణకట్టలోనూ తిరుక్షవరం చేసారు. అక్కడ
క్షురకులను దాదాపు 60శాతం తగ్గించేసారు. దానివల్ల భక్తుల సంఖ్యకు తగినంత మంది క్షురకులు
లేరు.
స్వామివారి దర్శనం చేసుకోడానికి క్యూలైన్లో
ప్రవేశించాక చాలా సమయం పడుతుంది. ఆ సమయంలో సెల్లార్లలో కూచునే భక్తులకు గతంలో
వివిధ ప్రసాదాలు పంచేవారు. చిన్నపిల్లలకు పాలు కూడా దొరికేవి. జగన్ సర్కారు వచ్చిన
తర్వాత ఆ పద్ధతి తొలగించేసారు. దాంతో క్యూలైన్లలో గంటల తరబడి వేచిఉండే భక్తులకు
ఎలాంటి ఆహారమూ దొరికే పరిస్థితి లేదు. ఈ విషయంలో ఇటీవల బాగా గొడవ అయేసరికి, మళ్ళీ గత
కొన్నాళ్ళుగా ప్రవేశపెట్టారు. అయితే గతంలోలా ఉదారంగా ఆహారం పంచుతున్న దాఖలాలు
లేవు.
ఇక తరిగొండ వెంగమాంబ సత్రంలో అన్నప్రసాదం
విషయంలో ఈమధ్య ఎన్నో గొడవలు జరిగాయి. ఒకప్పుడు కొండ మీద ఎక్కడ పడితే అక్కడ
నాణ్యమైన అన్నప్రసాదం ఉచితంగా పంచే ఏర్పాట్లుండేవి. ఇప్పుడు అవన్నీ పోయాయి. వెంగమాంబ
సత్రంలో సైతం ఏమాత్రం నాణ్యత లేని అన్నప్రసాదం పంపిణీ చేస్తున్నారు. రకరకాల సేవలకు
భక్తులు విరాళాలుగా ఇచ్చిన కోటానుకోట్ల నిధులున్నా, వాటన్నిటినీ అక్రమంగా
కొట్టేయడమే తప్ప భక్తులకు సౌకర్యాలు కల్పించి, ప్రశాంతమైన దర్శనం చేసుకునే
పరిస్థితి లేకుండా చేసారు.
తిరుమల చేరువలోనే ఉన్న శ్రీకాళహస్తిలో
సైతం అక్రమాలకు కొదవ లేదు. అక్కడ గుడిలోకి వెళ్ళే ముందు సెల్‌ఫోన్ ఉంచే క్లోక్‌రూం
కాంట్రాక్ట్ దక్కించుకున్నది అధికార పక్షానికి చెందినవారే. దాంతో బోర్డు మీద ధర రూ.5 ఉన్నప్పటికీ, ఒక ఫోన్‌కి రూ.50 వసూలు
చేస్తున్నారు. అదేమని అడిగిన భక్తులపై దాష్టీకాలకు పాల్పడుతున్నారు. ఇక గుడి
ఆవరణలోని దుకాణాల్లో మెట్టువాటా ముస్లిములకే దక్కుతున్నాయి. ఆ పద్ధతి మార్చాలని
ఏళ్ళ తరబడి హిందూసంఘాలు పోరుపెడుతున్నా, ఆచరణలో జరుగుతున్నది సున్నా.
తిరుమల చేరువలోనే ఉన్న శ్రీకాళహస్తిలో
సైతం అక్రమాలకు కొదవ లేదు. అక్కడ గుడిలోకి వెళ్ళే ముందు సెల్‌ఫోన్ ఉంచే క్లోక్‌రూం
కాంట్రాక్ట్ దక్కించుకున్నది అధికార పక్షానికి చెందినవారే. దాంతో బోర్డు మీద ధర రూ.5 ఉన్నప్పటికీ, ఒక ఫోన్‌కి రూ.50 వసూలు
చేస్తున్నారు. అదేమని అడిగిన భక్తులపై దాష్టీకాలకు పాల్పడుతున్నారు. ఇక గుడి
ఆవరణలోని దుకాణాల్లో మెట్టువాటా ముస్లిములకే దక్కుతున్నాయి. ఆ పద్ధతి మార్చాలని
ఏళ్ళ తరబడి హిందూసంఘాలు పోరుపెడుతున్నా, ఆచరణలో జరుగుతున్నది సున్నా.
వేంకటేశ్వరుడి తోబుట్టువుగా భావించే
విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి దర్శనం టికెట్ల రేట్లు సైతం భారీగా పెంచేసారు. 2005లో
ఉచిత దర్శనంతో పాటు ముఖమండప దర్శనం టికెట్ రూ.20, అంతరాలయ దర్శనం టికెట్ రూ.50
ఉండేవి. 2010లో ముఖమండప దర్శనం టికెట్ ధర రూ.50కి, అంతరాలయ దర్శనం టికెట్ ధర
రూ.100కు పెంచారు. 2014లో ముఖమండప దర్శనం టికెట్ ధర రూ.100కు పెంచారు. అంతరాలయ
దర్శనం టికెట్ ధర రూ.300కు పెంచి ఒక లడ్డూ ఇవ్వడం మొదలుపెట్టారు. 2022 దసరా పండుగల
నుంచి ఆ ధరలను మరింత భారీగా పెంచేసారు. ముఖమండపం టికెట్ ధరను రూ.300కు పెంచేసారు.
అంతరాలయ దర్శనం టికెట్ ధరను రూ.500కు పెంచి రెండు లడ్డూలు చేతిలో పెడుతున్నారు.
ఇంక ప్రసాదాల ధరలు, కళ్యాణకట్ట ధరలు కూడా భారీగా పెరిగాయి. పైగా, ఈ కొత్త ధరలను దసరా
సమయంలో ట్రయల్ బేసిస్ మీద ప్రవేశపెట్టి చూసామనీ, వాటికి భక్తుల నుంచి ఆదరణ
బాగున్నందున కొత్త ధరలను అమలు చేస్తున్నామనీ ఒక హాస్యాస్పదమైన వివరణ కూడా ఇచ్చారు.
దర్శనం చేసుకోడానికి వచ్చిన భక్తులు అక్కడకు వచ్చి టికెట్ ధరల గురించి గొడవ పెట్టుకోరు
కదా. అలా భక్తుల అవసరాన్ని, ఉదాసీనతనూ అడ్డుపెట్టుకుని అడ్డగోలుగా రేట్లు
పెంచేసారు.
ఈ మూడే కాదు, రాష్ట్రంలోని ప్రధాన హిందూ
దేవాలయాలు అన్నింటిలోనూ ఇదే పరిస్థితి. దర్శనానికి కేటగిరీలు పెట్టడం, టికెట్ ధరను
బట్టి దేవుణ్ణి దూరం నుంచో లేక దగ్గర నుంచో దర్శనం చేసుకోవలసిన దుస్థితి
కల్పించడం, ప్రసాదాలకు టికెట్లు పెట్టడం, వాటి ధరలూ భారీగా పెంచేయడం, వసతి సౌకర్యాల
ధరలూ విపరీతంగా పెంచేయడం… ఇవన్నీ భక్తులను దేవాలయ దర్శనానికి దూరం చేయాలనే ఉద్దేశంతోనే
చేస్తున్నారు.
అధికారంలో ఎవరున్నారన్నది ముఖ్యం కాదు, హిందూ
దేవాలయాల్లో ఏటికేటా అన్ని ధరలూ దారుణంగా పెంచేస్తున్నారు. భక్తుల సొమ్ముతో ఖజానా
నింపుకుంటున్నారు. ఆ సొమ్మును మసీదుల్లో ముల్లాలు, మువజ్జమ్లకు, చర్చి పాస్టర్లకు
గౌరవ వేతనాల పేరుతో, వారి ప్రార్థనాస్థలాల నిర్మాణాల పేరుతో పందేరం చేస్తున్నారు.
హిందూ క్షేత్రాల్లో హైందవేతర భక్తులు సైతం ఉద్యోగాలు చేస్తూ అక్కడి దేవీ దేవతలను
అవమానిస్తున్నా కనీస స్పందన ఉండడం లేదు. కేవలం హిందువుల దేవాలయాల ఆదాయాన్ని
దిగమింగే దేవదాయ ధర్మదాయ శాఖలో హైందవేతరులకు ఉద్యోగాలు ఇవ్వరాదన్న డిమాండ్లను
కనీసం పట్టించుకోవడం లేదు. ఇప్పుడు హజ్ యాత్ర ఖర్చులు కూడా తగ్గించాలంటూ ఏకంగా
కేంద్రాన్నే డిమాండ్ చేస్తున్నారు. హిందూ, హిందూయేతర భక్తుల పట్ల రాష్ట్ర
ప్రభుత్వం అవలంబిస్తున్న ద్వంద్వవైఖరి గర్హనీయం.