I-T raids : షిర్డీ
సాయి ఎలక్ట్రికల్స్ కార్యాలయాల్లో ఆదాయపు పన్ను శాఖ అధికారుల తనిఖీలు రెండో రోజూ
కొనసాగుతున్నాయి. కడప శివారులోని పారిశ్రామికవాడలో ఉన్న సంస్థకు చెందిన ఫ్యాక్టరీ
తో పాటు హైదరాబాద్ లోని ఆఫీసుల్లోనూ ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నాయి.
కడప
ఫ్యాక్టరీలో విద్యుత్ స్మార్ట్ మీటర్లు, ట్రాన్స్ ఫార్మర్లు, ఇతర పరికరాలు తయారు
చేస్తున్నారు. కడప రిమ్స్ సమీపంలోని కోట్ల
రూపాయల విలువైన 52 ఎకరాల ప్రభుత్వ భూమిని వైసీపీ ప్రభుత్వం ఇటీవలే ఈ కంపెనీకి కేటాయించింది.
భారీ ప్రాజెక్టులతో పాటు రైతులకు వ్యవసాయ విద్యుత్ సర్వీసులకు స్మార్ట్ మీటర్లు
బిగించే పనులు కూడా ఈ సంస్థకే రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది.
ఈ కంపెనీ సీఎం జగన్ కు చెందిన సన్నిహితులదని ప్రతిపక్షాలు
ఆరోపిస్తున్నాయి. సీఎం మెప్పు కోసమే కంపెనీకి ఆయాచితంగా ప్రభుత్వాధికారులు లబ్ధి
చేకూరుస్తున్నారని విమర్శిస్తున్నాయి.