జ్ఞానవాపి కేసులో మసీదు కమిటీ వేసిన అన్ని పిటీషన్లను అలహాబాద్ హైకోర్టు (gyanvapi) మంగళవారం కొట్టి వేసింది. ఈ కేసుకు సంబంధించిన విచారణను ఆరు మాసాల్లో పూర్తి చేయాలని కూడా వారణాసి కోర్టును అలహాబాద్ హైకోర్టు ఆదేశించింది. మొఘల్ రాజుల కాలంలో హిందూ ఆలయం స్థానంలో జ్ఞానవాపి మసీదు నిర్మించారని, ఈ విషయాన్ని సర్వే చేసి తేల్చాలంటూ హిందూ సంఘాలు కోర్టులో పిటీషన్ వేసిన సంగతి తెలిసిందే.
జ్ఞానవాపి కేసు విచారించిన కోర్టు…శాస్త్రీయ సర్వేకు ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీల్ చేసి వజూఖానా ప్రాంతాన్ని వదిలి, మసీదు ప్రాంగణం మొత్తం
కార్బన్ డేటింగ్, ఇతర శాస్త్రీయ విధానాల ద్వారా సర్వే నిర్వహించాలని భారత పురావస్తు శాఖను సుప్రీంకోర్టు ఆదేశించింది. మసీదు ప్రాంగణంలో ఆలయాన్ని పునరుద్దరించాలంటూ దాఖలైన పిటీషన్లను అంజుమన్ ఇంతెజామియా కమిటీ, ఉత్తరప్రదేశ్ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు అలహాబాద్ హైకోర్టులో సవాల్ చేశాయి. వారి పిటీషన్ను అలహాబాద్ హైకోర్టు కొట్టివేసింది.