fraudulent loan apps
మోసపూరిత రుణ యాప్‌లపై చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్రప్రభుత్వం
తెలిపింది. కేంద్రం ఆదేశాలతో గూగుల్ తన ప్లే స్టోర్ నుంచి 2,500 లోన్ యాప్‌లను
తొలగించినట్లు వెల్లడించారు. 2021 ఏప్రిల్ నుంచి 2022 జులై మధ్య ఈ చర్యలు చేపట్టినట్లు
పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం తరఫున ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఈ విషయాన్ని
రాతపూర్వకంగా సమాధానంగా వెల్లడించారు.
మోసపూరిత
రుణ యాప్‌ల కట్టడి విషయంలో రిజర్వు బ్యాంక్ సహా ఇతర నియంత్రణ సంస్థలతో
కేంద్రప్రభుత్వం చర్చలు జరుపుతూనే ఉందని కేంద్రమంత్రి పేర్కొన్నారు. ఆర్థిక
స్థిరత్వం, అభివృద్ధి మండలి(FSDC)
సమావేశాల్లో ఈ విషయాల ప్రస్తావన తరుచూ జరుగుతుందని వివరించారు.
భారత
ఆర్థిక వ్యవస్థ రక్షణ విషయంలో కేంద్రప్రభుత్వం నిరంతరం చురుగ్గా ఉండటంతో పాటు సైబర్
సెక్యూరిటీని ఎప్పటికప్పుడు సన్నద్ధం చేస్తున్నామన్నారు.
ప్రతికూల ప్రభావాలు చూపే
అంశాలపై సమయానుకూల చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
చట్టాలకు
అనుగుణంగా పనిచేసే లోన్ యాప్‌ల వివరాలను రిజర్వు బ్యాంకు ప్రభుత్వానికి
అందజేసిందని వాటిని గూగుల్ కు ఐటీ శాఖ పంపిందన్నారు. కేంద్రం చేపట్టిన చర్యలతో గూగుల్ తన
విధివిధానాల్లో మార్పులు చేసిందని, నిబంధనలు పాటించే యాప్‌లనే ప్లో స్టోర్ లోకి
అనుమతిస్తోందన్నారు.
భారతీయ
సైబర్ నేరాల సమన్వయ కేంద్రం (14C),
కేంద్ర హోంశాఖ డిజిటల్ లోన్ యాప్‌లను పర్యవేక్షిస్తున్నాయని వెల్లడించారు.