భారీ భూకంపం చైనాను (china earthquake) కుదిపేసింది. చైనా వాయువ్య గన్స్, కింగ్హౌ ప్రావిన్స్‌లో ఈ భూకంపం సంభవించింది.ఇప్పటికే 110 మంది చనిపోయినట్లు ప్రకటించారు. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశముంది.
భూకంపం తాకిడికి ఎత్తైన భవనాలు నేలమట్టం అయ్యాయి. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.2గా నమోదైంది. సోమవారం అర్థరాత్రి సంభవించిన భూకంపం దాటికి జనం ఇళ్లు వదలి పరుగులు తీశారు. సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. భూకంపం వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
వేలాది మంది గాయపడ్డారని స్థానిక మీడియా ద్వారా తెలుస్తోంది. భూకంపం దాటికి సర్వం కోల్పోయామని, ఇప్పటికీ తన కాళ్ల కింద భూమి కంపించినట్లు అనిపిస్తోందంటూ ఓ మహిళ సోషల్ మీడియాల పోస్ట్ చేసిన వీడియో వైరల్ అయింది.