Covid cases JN.1 subvariant : కోవిడ్ జేఎన్.1(JN.1) వేరియంట్
ప్రబలుతున్న నేపథ్యంలో కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ రాష్ట్రాలను అప్రమత్తం చేస్తోంది. తగిన
జాగ్రత్తలు తీసుకుని వ్యాధి ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
పండగల
సీజన్ కావడంతో మహమ్మారి వ్యాప్తికి అవకాశాలు ఉన్నాయని, ప్రజారోగ్యం విషయంలో
ప్రభుత్వాలు తగిన నియంత్రణ చర్యలు చేపట్టి వైరస్ వ్యాప్తిని అరికట్టాలని కోరింది. వైరస్
వ్యాప్తి అవకాశాలను తగ్గించడంతో పాటు కనీస ఆరోగ్య జాగ్రత్తల విషయంలో ప్రజలను
అప్రమత్తం చేయాలని కోరింది.
జిల్లాల
వారీగా శ్వాసకోస వ్యాధులను సమీక్షించడంతో పాటు తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలను
గుర్తించి కేంద్రానికి నివేదించాలని ఆదేశించింది.
గత
నిబంధనలు అనుసరించి కరోనా పరీక్షలు నిర్వహించాలని పేర్కొన్న కేంద్రం, వ్యాధి
నిర్ధారణ కోసం ఆర్టీపీసీఆర్ పరీక్షతో పాటు సార్స్ కోవి-2(SARS COV-2) జీనోమ్ కన్సోర్టియమ్ లేబరేటరీకి
పంపాలని సూచించింది. తద్వారా కొత్త వేరియంట్లను గుర్తించే అవకాశముందని పేర్కొంది.
వ్యాధి
సోకిన వారు భౌతికదూరం పాటించాలని అలాగే దగ్గు, తుమ్ములు వచ్చినప్పుడు నోటికి
అడ్డుపెట్టుకోవడం ద్వారా వైరస్ ప్రబలకుండా ఉంటుందన్నారు.
కోవిడ్
వ్యాప్తి ప్రస్తుతం నియంత్రణలోనే ఉంది. దేశవ్యాప్తంగా 1.828 పాజిటివ్ కేసులు ఉన్నాయి. జేన్1 వేరియంట్ సోకిన
ఓ వ్యక్తి కేరళలో చనిపోయాడు. ఈ వేరియంట్ ను ఈ ఏడాది సెప్టెంబర్ లో అమెరికాలో మొదటగా
గుర్తించారు.