అయోధ్యలో రామాలయం (ayodya ramalayam) నిర్మించాలని, ఉద్యమానికి బీజం వేసి, దేశ వ్యాప్తం చేసిన బీజేపీ సీనియర్ నేత అడ్వాణీకి చుక్కెదురైంది. జనవరి 22న జరిగే ఆలయ ప్రారంభోత్సవానికి వేల సంఖ్యలో ప్రముఖులు వచ్చే అవకాశముంది. వయసు రీత్యా అడ్వాణీ, మురళీ మనోహర్ జోషి ఇద్దరూ, వారి ఆరోగ్యం, వయసు దృష్టిలో పెట్టుకుని జనవరి 22న అయోధ్యకు రావద్దని రామ మందిర ట్రాస్టు సూచించింది. వారి వినతిని వారిద్దరూ అంగికరించినట్లు తెలుస్తోంది.
అడ్వాణీ, ముళీమనోహర్ జోషి ఇద్దరూ తమ వినతిని అంగీకరించినందుకు రామ జన్మభూమి ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ అభినందనలు తెలిపారు. జనవరి 22న జరిగే ఆలయ ప్రారంభోత్సవానికి హాజరు కావాలంటూ మాజీ ప్రధానమంత్రి దేవెగౌడను ఆహ్వానించేందుకు ముగ్గురు సభ్యుల బృందాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. అడ్వాణీ, మురళీమనోహర్ జోషిలకు ఆహ్వానం లేకపోవడంపై బీజేపీ నేతల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.