ISIS terrorists in
India, 8 arrested in Ballari
అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ‘ఐసిస్’
మోడ్యూల్ కర్ణాటకలోని బళ్ళారిలో బైటపడింది. (ISIS module in Ballari). జాతీయ
దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ (NIA) ఈ ఉదయంఎనిమిది మంది ఐసిస్ ఉగ్రవాదులను అరెస్ట్ చేసింది. (Eight terrorists arrested). ఇంప్రొవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్ – ఐఈడీ బాంబులను (IED Bombs) పేల్చడానికి వారు చేస్తున్న కుట్రను భగ్నం చేసింది.
ఎన్ఐఏ ఈ ఉదయం నాలుగు రాష్ట్రాలలోని 19
ప్రదేశాల్లో సోదాలు నిర్వహించింది. ఎన్ఐఏ అధికారులు ఢిల్లీ, మహారాష్ట్ర, జార్ఖండ్,
కర్ణాటక రాష్ట్రాల్లో అనుమానిత ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు.
బళ్ళారిలో పట్టుబడిన ఉగ్రవాదుల దగ్గర
సల్ఫర్, పొటాషియం నైట్రేట్, గన్‌పౌడర్ వంటి పేలుడు పదార్ధాలు, పలు ఆయుధాలు, వివిధ
ప్రదేశాల్లో దాడులు చేయడానికి వేసుకున్న స్కెచ్‌లు దొరికాయని ఎన్ఐఏ ఒక ప్రకటనలో
వెల్లడించింది. ఉగ్రవాదుల దగ్గరనుంచి కొన్ని కత్తులు, నగదు, డిజిటల్ పరికరాలు కూడా
స్వాధీనం చేసుకున్నారు.
కర్ణాటక పోలీసుల సహాయంతో ఎన్ఐఏ చేపట్టిన
సోదాల్లో, బళ్ళారి ఐసిస్ మోడ్యూల్ నాయకుడు మహమ్మద్ సులేమాన్ అలియాస్ మినాజ్ అధికారులకు
పట్టుబడ్డాడు. ఎన్ఐఏ అధికారులు మహారాష్ట్రలోని ముంబై, పుణే, దేశ రాజధాని ఢిల్లీ,
కర్ణాటకలోని బెంగళూరు, బళ్ళారి, జార్ఖండ్‌లోని బొకారో నగరాల్లో భారీస్థాయిలో
సోదాలు చేపట్టారు.
ఈ ఉగ్రవాదులు పరస్పరం మాట్లాడుకోడానికి
మొబైల్ ఫోన్ల బదులు ఐఎం యాప్‌లు వాడుకున్నారు. వారు ఐఈడీల కోసం పేలుడు పదార్ధాలను
వాడాలని ముందే నిర్ణయించుకున్నారు. ఐసిస్ ఉగ్రవాదులు కాలేజీ పిల్లలను ఇళ్ళకు వెళ్ళవద్దని
స్పష్టంగా వెల్లడించారు.
బళ్ళారి మోడ్యూల్‌లో ఎన్ఐఏ కేసు గతవారం
నమోదయింది. అప్పటినుంచీ రాష్ట్ర పోలీసులతో కలిసి ఎన్ఐఏ అధికారులు పనిచేస్తున్నారు.
తద్వారా ఉగ్రవాదుల కార్యకలాపాలను ట్రాక్ చేయగలిగారు.
ఎన్ఐఏ గతవారం మహారాష్ట్రలో
సుమారు 40 ప్రదేశాల్లో సోదాలు చేపట్టింది. అప్పుడే 15మందిని అరెస్ట్ చేసారు. వారిలో
ఒకవ్యక్తి ఒక మాడ్యూల్‌కు నాయకుడిగా, సహచరులతో కలిసి పనిచేస్తున్నాడు. ఇవాళ అలాంటి
వ్యక్తి మరొకరు అరెస్టయ్యారు,