Huge march at
Balochistan against genocide
పాకిస్తాన్‌లోని బలోచిస్తాన్ ప్రోవిన్స్
డేరా గాజీ ఖాన్ ప్రాంతంలో వేలాది బలోచ్‌లు భారీ ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. (Baloch March) తమ జాతి సామూహిక జనహననానికి నిరసన ప్రకటిస్తూ వేలమంది బలోచ్‌లు
రహదారిపై కూర్చుండిపోయారు. బలోచ్ క్యాడర్ అరెస్టులు, పలువురు బలోచీల అదృశ్యంపై వారు
ఆందోళన వ్యక్తం చేసారు. (Protest
against genocide)
బలోచ్ యూనిటీ కమిటీ (Baloch Unity Committee) అనే సంస్థ ఈ ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టింది. తమ జాతిని అంతం
చేయడానికి దేశ ప్రభుత్వమే తమపై ఉగ్రవాదుల్లా దాడులు చేస్తోందని వారు ఆవేదన వ్యక్తం
చేసారు. బలోచిస్తాన్ ప్రొవిన్స్‌లోని మక్రాన్, ఝలావాన్, సరావాన్, కోహిస్తాన్, కోహే
సులేమాన్, డేరా గాజీ ఖాన్ ప్రాంతాలకు చెందిన ప్రజలు ప్లకార్డులు, బ్యానర్లు పట్టుకుని
నినాదాలు చేసారు. కిడ్నాపులు, హత్యలు, నకిలీ ఎన్కౌంటర్లను బలోచ్ ‘దేశం’
ఇంకెంతమాత్రం సహించదంటూ ఆందోళనకారులు ఆగ్రహం వ్యక్తం చేసారు.
‘ఇవాళ్టి ధర్నా తర్వాత రేపు నిరసన
ప్రదర్శన చేపడతారు. డేరా గాజీ ఖాన్ ప్రాంతంలోని గడాయ్ చంగీ ప్రాంతంలో బలోచ్
సాలిడారిటీ కమిటీ (Baloch
Solidarity Committee) ధర్నాను విఫలం
చేయడానికి పోలీసులు రహదారిని అన్నివైపుల నుంచీ మూసివేసారు. వారు ఈ ధర్నాలో
పాల్గొనే ప్రజలను హింసిస్తున్నారు’ అని ఇవాళ్టి ధర్నాను నిర్వహిస్తున్న ‘బలోచ్ యాగ్జేదీ
కమిటీ’ ఎక్స్ మాధ్యమంలో ట్వీట్ చేసింది.
బలోచిస్తాన్ రాష్ట్రంలోని ప్రధాన
నగరాల్లో, ఇంకా పలు ఇతర ప్రాంతాల్లో ప్రజలు స్వచ్ఛందంగా ఈ ధర్నాలో పాల్గొన్నారు.
తమ జాతికి చెందిన ప్రజలను హతమార్చడం, ఎత్తుకుపోయి అదృశ్యం చేయడానికి వ్యతిరేకంగా ఈ
ఆందోళన కార్యక్రమాలను చేపట్టారు.
భారత సరిహద్దుకు సమీపంలో ఉన్న బలోచిస్తాన్
ప్రాంతంపై పాక్ ప్రభుత్వాలు మొదటినుంచీ సవతితల్లి ప్రేమ చూపిస్తూ వస్తున్నాయి.
బలోచ్ ప్రాంతీయులు భారత్‌కు అనుకూలంగా ఉంటారన్న ప్రచారం కూడా ఉంది.