A Christian destroyed
road to temple
భారతదేశంలో, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో
క్రైస్తవుల ఆగడాలు అన్నీ ఇన్నీ కావు. హిందువులను మతం మార్చడానికి హిందూ
దేవీదేవతలపై అసత్య ప్రచారాలు చేయడం, హిందూ ఆచార సంప్రదాయాలను పాటించకుండా
అమాయకులను ప్రభావితం చేయడం వంటి అకృత్యాలకు పాల్పడడం వంటి సంఘటనలు ఏళ్ళ తరబడి
జరుగుతున్నాయి. ప్రత్యేకించి గత నాలుగైదేళ్ళుగా క్రైస్తవుల అత్యాచారాలు
మితిమీరిపోతున్నాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్నవారు క్రైస్తవ మతానుయాయులు కావడంతో
తమను ఎవరూ ఏమీ చేయలేరన్న ధీమాతో వారు ప్రవర్తిస్తున్నారు. అలాంటి ఘటన ఒకటి తాజాగా
బైటపడింది. (Temple road destroyed)
నెల్లూరు జిల్లా అల్లూరు మండలంలో
ఇందుకూరు అనే చిన్న గ్రామంలో (Indukur village, Nellore district) ఓ క్రైస్తవుడు పాల్పడిన అరాచకమిది. సుమారు
50సంవత్సరాల క్రితం ఆ గ్రామంలో ఒక హిందూ భక్తుడు స్థానిక ఎస్సీ కాలనీలో దాదాపు
ఎకరం స్థలంలో ఒక దేవాలయ సముదాయం నిర్మించారు. ఆ సముదాయంలో శివాలయం, అమ్మవారి గుడి,
ఆంజనేయస్వామి ఆలయం, ఇంకా వివిధ దేవతామూర్తుల విగ్రహాలూ ఉన్నాయి. ఆ ఆలయ సముదాయం
నిర్మాణం కోసం ఆ భక్తుడు ప్రధానంగా తన సొంత డబ్బులు ఖర్చు చేసాడు. మరికొందరు
భక్తులు కూడా విరాళాల రూపంలో సహాయపడ్డారు. అలాంటి దేవాలయంలో దేవతామూర్తుల
నిత్యనైమిత్తిక పూజలకు ఇబ్బంది కలిగించేలా, అసలు ఆ గుడికి భక్తులు వెళ్ళకుండా
ఉండేలా ఒక క్రైస్తవ వ్యక్తి అడ్డుపడుతున్నాడు. (Christian atrocity on Hindu temple)
ఆ క్రైస్తవ వ్యక్తి రాష్ట్రంలో అధికారంలో
ఉన్న వైస్సార్సీపీకి చెందిన వ్యక్తి అని స్థానికులు చెబుతున్నారు. జగన్ ప్రభుత్వం
ప్రవేశపెట్టిన ఇంటింటికీ రేషన్ సరఫరా చేసే బండిని ఆ వ్యక్తి నిర్వహిస్తున్నాడు.
స్థానికుల కథనం ప్రకారం… నిజానికి ఆ వ్యక్తి గతంలో ఎస్సీ సామాజిక వర్గానికి
చెందిన వ్యక్తే. కొంతకాలం క్రితమే అతను క్రైస్తవమతంలోకి మారాడు. అయినప్పటికీ ఇంకా
ఎస్సీ రిజర్వేషన్లు అనుభవిస్తూనే ఉన్నాడు. క్రైస్తవమతంలోకి మారిన తర్వాత ఆ వ్యక్తి
హిందూమతంపై ద్వేషం పెంచుకున్నాడు. ఆ కాలనీలో ఉన్న గుడికి భక్తులను వెళ్ళనీయకుండా
చేయాలని కంకణం కట్టుకున్నాడు. ఇటీవలి కాలంలో అతను ఆ గుడికి వెళ్ళే రహదారిని
తవ్వించేసాడు. అంతేకాకుండా కర్రలు, రేకులు అడ్డుపెట్టి ఆ గుడికి భక్తులు
వెళ్ళకుండా అడ్డుకుంటున్నాడు. (Road
to temple destroyed)
స్థానిక హిందువులు ఇదేం అన్యాయమని
ప్రశ్నిస్తే, వారికి వచ్చే రేషన్ రానీయకుండా చేస్తానని బెదిరిస్తున్నాడు.
అంతేకాకుండా తనను నిలదీసే వ్యక్తులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడతామని
బెదిరిస్తున్నాడు. దేవాలయం ధర్మకర్తలు, అర్చకులు ఈ విషయాన్ని అధికారుల దృష్టికి
తీసుకువెళ్ళామని చెబుతున్నారు. అయితే అధికారులు కనీసం ఎలాంటి చర్యలూ తీసుకోలేదని
వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. (Threatening
on the name of ruling YSRCP)
హిందువుల దేవాలయలంలోకి హిందువులు
వెళ్ళకుండా క్రైస్తవులు అడ్డుకుంటుంటే అధికారులు ఏమీ చేయకుండా నిర్లిప్తంగా
వ్యవహరిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో హిందువులు నిస్సహాయ స్థితిలో మిగిలిపోయారు. హిందువుల
నిర్లిప్త, ఉదాసీన వైఖరిని అదనుగా తీసుకుని, ఆ దుండగుడు పాలక పక్షానికి
చెందినవాడని భయపడి అధికారులు ఏమాత్రం స్పందించకుండా ఉండిపోవడం శోచనీయం.
ఈ విషయం తెలుసుకున్న
‘హైందవశక్తి’ అనే హిందూ సంస్థ, ఈ మొత్తం వ్యవహారంపై న్యాయపోరాటం చేయడానికి
భావిస్తోంది. (Haindava Shakti Organization) ముందుగా క్షేత్రస్థాయి వాస్తవాలను తెలుసుకోడానికి తమ బృందాన్ని ఆ
గ్రామానికి పంపిస్తోంది. దాన్ని బట్టి కార్యాచరణను నిశ్చయించుకుని ముందడుగు
వేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఇలాంటి పోరాటస్ఫూర్తి ప్రబలినప్పుడే హిందూ సమాజం
తమపై జరుగుతున్న దాడులను అడ్డుకోగలుగుతుంది.