గాజాపై ఇజ్రాయెల్ భీకరదాడులు కొనసాగిస్తోంది. తాజాగా దక్షిణ గాజాలో 200 హమాస్ ఉగ్రవాదుల స్థావరాలపై(israel hamas war) దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. గాజాలోని షిజాయా పట్టణంలో హమాస్ ఉపయోగిస్తోన్న అపార్టుమెంట్లపై కూడా దాడులు చేసినట్లు ఐడీఎఫ్ వెల్లడించింది. హమాస్ ఉగ్ర స్థావరాల నుంచి ఆయుధాలు, సైనిక పరికరాలకు స్వాధీనం చేసుకున్నామని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది.
గాజా, ఇజ్రాయెల్ సరిహద్దులో భారీ సొరంగం బయటపడింది. సరిహద్దుకు సమీపంలోనే 4 కి.మీ పొడవైన సొరంగం ఉన్నా ఇజ్రాయెల్ గుర్తించలేకపోయింది. కట్టుదిట్టమైన భద్రత ఉండే ఎరెజ్ క్రాసింగ్ వద్ద ఈ సొరంగాన్ని సైన్యం గుర్తించింది.
ఈ సొరంగంలో కార్లు వెళ్లేంత విశాలంగా తవ్వారు. అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై హమాస్ ఉగ్రవాదులు జరిపిన దాడికి ఉపయోగించిన ఆయుధాలను ఈ సొరంగం ద్వారానే తరలించినట్లు అనుమానిస్తున్నారు. ఎరెస్ క్రాసింగ్ సరిహద్దు వద్ద నుంచే హమాస్ ఉగ్రవాదులు అక్టోబరు 7న ఇజ్రాయెల్‌లోకి ప్రవేశించారు. గాజాలో కాల్పుల విరమణకు చొరవ చూపాలని ఇజ్రాయెల్‌పై స్థానికంగా ఒత్తిడి పెరుగుతోంది.