మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో (ys vivekananda reddy murder case) కీలక మలుపు చోటు చేసుకుంది. వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీత, ఆమె భర్త రాజశేఖర్‌రెడ్డి, హత్య కేసు దర్యాప్తు చేసిన సీబీఐ ఎస్పీ రాంసింగ్‌పై పోలీసు కేసు నమోదైంది. వివేకాహత్య కేసులో పులివెందులకు చెందిన కొందరి పేర్లు చెప్పాలంటూ తనను బెదిరిస్తున్నారంటూ వివేకానందరెడ్డి మాజీ పీఏ కృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
తమకు అనుకూలంగా సాక్ష్యం చెప్పాలంటూ తనపై ఒత్తిడి తెస్తున్నారంటూ కృష్ణారెడ్డి గతంలోనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివేకా కుమార్తె సునీతారెడ్డి, ఆమె భర్త రాజశేఖర్‌రెడ్డి కూడా తనపై ఒత్తిడి తెస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనకు రక్షణ కల్పించాలని కోరినా ఇవ్వలేదని పీఏ కృష్ణారెడ్డి కోర్టును ఆశ్రయించాడు.
కోర్టు ఆదేశాల మేరకు సునీతారెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, రాంసింగ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.