అండర్ వరల్డ్ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం (Dawood Ibrahim) తీవ్ర అనారోగ్యంలో కరాచీ ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తోంది. దావూద్‌పై విష ప్రయోగం జరిగిందంటూ పాక్‌లోని స్థానిక మీడియా ద్వారా సమాచారం అందుతోంది. భారీ భద్రత నడుమ అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం అందుతోంది.డాక్టర్లు, దావూద్ కుటుంబ సభ్యులను మాత్రమే ఆస్పత్రిలోకి అనుమతిస్తున్నారు. దావూద్ అనారోగ్యం వార్తలపై ముంబై పోలీసులు మరింత సమాచారం రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు.
దావూద్‌పై విష ప్రయోగం జరిగిందంటూ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పాక్‌లో మొత్తం ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. గత కొంత కాలంగా ఉగ్రవాదుల వరుస హత్యల నేపథ్యంలో దావూద్‌పై విష ప్రయోగం జరిగిందనే అనుమానాలు బలపడుతున్నాయి. భారత్‌లో ఉగ్రవాదానికి పాల్పడిన అనేక మంది కీలక ఉగ్రవాదులు ఇటీవల దుండగుల కాల్పులో హతమైన సంగతి తెలిసిందే.