Bharat vs South Africa 1st ODI: మూడు
వన్డేల సిరీస్ లో భాగంగా దక్షిణాఫ్రికాలో
పర్యటిస్తున్న భారత్ జట్టు మొదటి వన్డే లో
అద్భుత విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. కేఎల్ రాహుల్ సేన అవలీలగా సఫారీ జట్టును
ఓడించింది.
జొహాన్నెస్ బర్గ్ లోని న్యూ వాండరర్స్ స్టేడియం వేదికగా జరిగిన పోరులో
టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా బ్యాటింగ్ ఎంచుకుని, 27.3 ఓవర్లలో 116 పరుగులకే
ఆలౌటైంది.
భారత్ జట్టు రెండు వికెట్లు కోల్పోయి 16.4 ఓవర్లలో
లక్ష్యాన్ని ఛేదించి విజయాన్ని అందుకుంది. 8 వికెట్ల తేడాతో గెలిచి రికార్డు సృష్టించింది.
వియాన్
ముల్డర్ వేసిన 3.4 ఓవర్ లో రుతురాజ్ గైక్వాడ్(5) వద్ద ఔట్ అయ్యాడు. భారత జట్టు
తరఫున తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న సాయి సుదర్శన్, శ్రేయస్ అయ్యర్ లు చెరో
అర్ధ సెంచరీ కొట్టారు. శ్రేయస్ అయ్యర్ 45 బంతుల్లో 52 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. దీంతో
111 పరుగుల వద్ద భారత్ రెండో వికెట్ నష్టపోయింది. తర్వాత తిలక్ వర్మ, సాయి
సుదర్శన్ కలిసి లక్ష్యాన్ని ఛేదించారు. సాయి సుదర్శన్ 43 బంతుల్లో 55 పరుగులతో
నాటౌట్ గా నిలిచాడు. తిలక్ వర్మ(1*) తో కలిసి గెలుపు లాంఛనాన్ని సుదర్శన్
పూర్తి చేశాడు. ఫెలుక్వాయో,
వియాన్ ముల్డర్ చెరో వికెట్ తీశారు.
దక్షిణాఫ్రికా
జట్టులో ఫెలుక్వాయో(33) టాప్ స్కోరర్ గా నిలిచాడు. జోర్జి(22), మార్క్రమ్(12), షంషి(11) మాత్రమే
రెండంకెల స్కోర్ చేశారు. అర్ష్దీప్ 5 వికెట్లు తీయగా, అవేశ్ ఖాన్ 4 వికెట్లు
పడగొట్టాడు. కుల్దీప్ యాదవ్ ఓ వికెట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.
ఈ విజయంతో భారత్ జట్టు మూడు మ్యాచుల సిరీస్
లో 1-0తో ఆధిక్యంలో ఉంది.రెండో వన్డే డిసెంబర్ 19న జరగనుంది.