Bharat vs South Africa 1st ODI: మూడు వన్డేల సిరీస్ లో భాగంగా భారత్, దక్షిణాఫ్రికా
మధ్య జరిగిన తొలి మ్యాచులో సఫారీ జట్టు పేలవంగా ఆడింది. జొహాన్నెస్ బర్గ్ లోని న్యూ వాండరర్స్ స్టేడియం వేదికగా జరుగుతున్న
పోరులో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా బ్యాటింగ్ ఎంచుకుంది.
27.3 ఓవర్లలో 116
పరుగులకే ఆలౌటైంది. అర్ష్దీప్ 5 వికెట్లు తీయగా, అవేశ్ ఖాన్ 4 వికెట్లు
పడగొట్టాడు. కుల్దీప్ యాదవ్ ఓ వికెట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.
దక్షిణాఫ్రికా జట్టులో ఫెలుక్వాయో(33) టాప్ స్కోరర్
గా నిలిచాడు. జోర్జి(22), మార్క్రమ్(12),
షంషి(11) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు.
రెండో
ఓవర్లోనే భారత లెఫ్టార్మ్ పేసర్ అర్షదీప్ సింగ్ డబుల్
బ్రేక్ ఇచ్చాడు.
వరుసగా రెండు బంతుల్లో రెండు వికెట్లు తీశాడు. నాలుగో బంతికి రీజా హెండ్రిక్స్ (0)ను బౌల్డ్ చేసిన
అర్షదీప్… ఆ తర్వాతి బంతికే వాన్ డర్ డుసెన్ (0)ను ఎల్బీడబ్ల్యూ చేశాడు. సౌతాఫ్రికా
జట్టులో మొత్తం ముగ్గురు డకౌట్ గా పెవిలియన్ చేరారు.