భారత వాయుసేన మరింత పటిష్టంగా మారింది. దేశీయంగా
తయారు చేసిన సమర్(samar) మిస్సైల్ ను విజయవంతంగా ప్రయోగించింది.
దీంతో మన రక్షణ వ్యవస్థ మరింత శుత్రు దుర్భేద్యంగా మారింది. దేశీయ పరిజ్ఞానంతో
తయారు చేసిన ఈ మిస్సైల్ తో భూ ఉపరితలం నుంచే గగనతలంలోని లక్ష్యాలను టార్గెట్
చేయవచ్చు.
గగనతలం నుంచి గగన తలంలోని లక్ష్యాన్ని చేధించే రష్యా మిస్సై టెక్నాలజీ
ఆధారంగా దీనిని రూపొందించారు.
ఆంధ్రప్రదేశ్
లోని సూర్యలంక ఎయిర్ స్టేషన్ లో నిర్వహించే అస్త్రశక్తి -2023 విన్యాశాల్లో ఈ
ప్రయోగాన్ని చేపట్టిన భారత వాయుసేన, అన్ని విభాగాల్లోనూ విజయం సాధించింది. ఒకేసారి
రెండు లక్ష్యాన్ని చేధించేలా ఈ మిస్సైల్ ను రూపొందించారు.