బీహార్‌లో అరాచకం చోటుచేసుకుంది. గోపాల్‌గంజ్ జిల్లా దానాపూర్ గ్రామంలో 32 సంవత్సరాల పూజారి మనోజ్ కుమార్ (CRIME NEWS) వారం నుంచి కనిపించకుండా పోయాడు. చివరగా అతను సోమవారం శివాలయం నుంచి బయటకు వస్తున్నప్పుడు కొందరు గమనించినట్లు పోలీసులు తెలిపారు. దుండగులు మనోజ్ కుమార్‌ను అత్యంత దారుణంగా చంపారు. కళ్లుపీకి, ప్రైవేటు భాగాలను కోసి, కాల్చి చంపినట్లు తేలింది. అతని మృత దేహాన్ని సమీపంలోని పొదల నుంచి వెలికి తీశారు.
మనోజ్ కుమార్ మృతదేశం లభించిన తరవాత దానాపూర్ గ్రామంలో అల్లర్లు చెలరేగాయి. మనోజ్ సోదరుడు అశోక్ గతంలో బీజేపీలో పనిచేశాడని తెలుస్తోంది. మనోజ్‌ను దారుణంగా హింసించి చంపడానికి నిరసనగా గ్రామస్థులు జాతీయ రహదారిని దిగ్భందనం చేశారు. పోలీసులపై రాళ్లు రువ్వారు. వారి వాహనానికి నిప్పు పెట్టారు.
మనోజ్ కుమార్ కనిపించడం లేదంటూ అతని కుటుంబ సభ్యులు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా మృతదేహం లభించింది. దానాపూర్ గ్రామంలో పరిస్థితి ప్రస్తుతానికి అదుపులో ఉందని, అదనపు బలగాలు రప్పించినట్లు డీఎస్పీ ప్రాంజల్ తెలిపారు.నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.