పార్లమెంటులో భద్రతా వైఫల్యంపై ప్రధాని మోదీ (PM NARENDRA MODI) మొదటి సారి స్పందించారు. ఈ ఘటన చాలా తీవ్రమైనదని, రాజకీయం చేయవద్దని హితవు పలికారు. ఈ దాడిని ఏ మాత్రం తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదని ఆయన అన్నారు. ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేయవద్దని సూచించారు. ఇలాంటివి పునరావృతం కాకుండా పరిష్కారం కనుగొనాలని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు.
పార్లమెంటులో భద్రతా వైఫల్యం ఎంతో బాధించింది. ఈ ఘటనను తక్కువగా అంచనా వేయకూడదు.ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా, సరైన పరిష్కారం కనుగొనాలని మోదీ అన్నారు. ఘటనపై స్పీకర్ ఓం బిర్లా విచారణకు ఆదేశించినట్లు గుర్తుచేశారు. దర్యాప్తుపై తనకు పూర్తి విశ్వాసం ఉందని, త్వరలో అసలు దోషులెవరో తేలుతుందన్నారు.