World’s Largest
Office: ప్రపంచంలోని అతిపెద్ద
వాణిజ్య భవనాన్ని సూరత్ లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.
సూరత్ లో నిర్మించిన డైమండ్ బోర్స్ కార్యాలయాన్ని ప్రధాని మోదీ, గుజరాత్
సీఎం భూపేంద్ర పాటిల్ తో కలిసి ప్రారంభించారు.
వజ్రాలు, ఆభరణాల వ్యాపారం కోసం ఈ భవనాన్ని
అధునాతన హంగులతో నిర్మించారు. ముంబై నుంచి డైమండ్ బిజినెస్ అంతా సూరత్ కు వెళుతుందనే
ప్రచారం కూడా జరుగుతోంది.పెంటగాన్ లోని కార్పొరేట్ ఆఫీసు రికార్డును ఈ భవనం
అధిగమించింది.
6.7 మిలియన్ చదరపు అడుగుల్లో నిర్మించిన ఈ
బహుళ అంతస్తుల భవన నిర్మాణం కోసం 3,2 00 కోట్లు ఖర్చు చేశారు.
యూఎస్ లోని అత్యుత్తమ ఆఫీసుల్లో
ఒకటైన పెంటగాన్ ఆఫీసును 1943లో 6.5 మిలియన్ చదరపు అడుగుల్లో నిర్మించారు.
700
ఎకరాల డ్రీమ్ సిటీలోని 35 ఎకరాల విస్తీర్ణంలో 9 టవర్లుగా డైమం బోర్స్ భవనాన్ని నిర్మించారు. ఒక్కో టవర్ లో 15 అంతస్తులు
ఉంటాయి. ఇక్కడ 4,200 ఆఫీసులు, 67 వేల మంది ఉద్యోగులు పనిచేయవచ్చు.
అంతర్జాతీయ వజ్రాభరణాల వ్యాపారానికి సూరత్
ల్యాండ్‌మార్క్ గా నిలవబోతుంది.
27 వజ్రాభరణాల రిటైల్ దుకాణాలతో పాటు దేశీయ, విదేశీ
కొనుగోలుదారుల కోసం డైమండ్ జ్యువెలరీ షాప్ కూడా ఏర్పాటు చేయనున్నారు.
4 వేల కెమెరాలతో బిల్డింగ్ మొత్తం నిరంతరం నిఘా
ఉంటుంది. ఉద్యోగులు, సిబ్బంది రాకపోకలు మొత్తం బయోమెట్రిక్ విధానంలో
జరుగుతాయి.
భారత్ లో ఇప్పటి వరకు వజ్రాల ఎగుమతులు కేంద్రంగా ముంబై
ఉండగా, సూరత్ ను కూడా డైమండ్ సిటీగా పిలుస్తారు. అత్యంత అరుదైన వజ్రాలు ఇక్కడ
విక్రయిస్తుంటారు.