TIRUMALA: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనానికి వచ్చే
భక్తుల కోసం 2024 మార్చికి సంబంధించి ఆన్లైన్ టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. శ్రీవారి
ఆర్జిత సేవా టికెట్ల లక్కీడిప్ కోసం ఈ నెల
18న ఉదయం 10 గంటల నుంచి 20 వరకు ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకోవచ్చు.
21న ఉదయం 10 గంటలకు శ్రీవారి ఆర్జిత
సేవలైన కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవా
టికెట్ల కోటా విడుదల చేయనున్నారు.
మధ్యాహ్నం 3 గంటలకు కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ,
ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార వర్చువల్ సేవలకు సంబంధించిన టికెట్లు, దర్శన
టికెట్ల కోటా విడుదల చేస్తారు.
23న
ఉదయం 11 గంటలకు
శ్రీవాణి ట్రస్టు దాతల దర్శనం, గదుల కోటా, మధ్యాహ్నం
3 గంటలకు
వృద్ధులు, దివ్యాంగుల
దర్శన టికెట్ల కోటా విడుదల చేస్తారు.
25న ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను
భక్తులకు అందుబాటులో ఉంచుతారు. మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలోని గదుల కోటా విడుదల
చేస్తారు. https://ttdevasthanams.ap.gov.in ద్వారా శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ
అధికారులు తెలిపారు.
వైకుంఠ
ఏకాదశిని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 23 నుంచి జనవరి1 వరకు వైకుంఠ ద్వారం గుండా భక్తులకు
దర్శనం కల్పించేందుకు తితిదే ఏర్పాట్లు చేస్తోంది. టోకెన్లు కలిగిన భక్తులనే
తిరుమలకు అనుమతించనున్నారు.
డిసెంబరు 27న ఉదయం 11 గంటలకు తిరుమల, తిరుపతిలోని శ్రీవారి సేవ కోటాను, అదేరోజు మధ్యాహ్నం 12 గంటలకు నవనీత సేవ కోటాను, మధ్యాహ్నం 3 గంటలకు పరకామణి సేవ కోటాను ఆన్లైన్లో
అందుబాటులో ఉంచుతారు.
ధనుర్మాసం సందర్భంగా నేటి నుంచి వచ్చే ఏడాది జనవరి 14 వరకు తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్
స్వామి మఠంలో ఉదయం 7 నుండి 8 గంటల వరకు తిరుప్పావై పాశురాలను
పారాయణం చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తుల కోసం ఎస్వీబీసీ ఈ
కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.
తిరుమల ఆస్థానమండపంలో హైదరాబాదుకు చెందిన వేదాంత
విద్వాంసులు డా. గోవర్ధనం స్వామినాథాచార్యులు నెల రోజుల పాటు ఉదయం 8 నుండి 9 గంటల వరకు
తిరుప్పావై ప్రవచనాలు చేస్తారు.
నేటి నుంచి స్వామివారికి
నిర్వహించే సుప్రభాత సేవ స్థానంలో తిరుప్పావై నివేదిస్తున్నారు. కాగా ధనుర్మాస ఘడియలు 2024 జనవరి 14న ముగియనున్నాయి. అప్పటివరకు
సుప్రభాతం సేవ ఉండదు.